Home Lifestyle Horoscope & Vaasthu Weekly Horoscope | రాశిఫలాలు (15-03-2023 )

Weekly Horoscope | రాశిఫలాలు (15-03-2023 )

Image Source : Pixabay

Weekly Horoscope | మేషం

నూతన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

వృషభం

శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేసినా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఉద్యోగంలో ఎదురైన చికాకులు కొంతవరకు తీరుతాయి.

మిథునం

ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం అందుకుంటారు. శ్రమ మీది ఫలితం వేరొకరిది అన్నట్లుగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. జీవిత భాగస్వామి నుంచి ధన లాభం పొందుతారు.

కర్కాటకం

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు. ఉద్యోగ యత్నాలకు అనుకూలమైన కాలం. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

సింహం

పనులు సాఫీగా సాగుతాయి, ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. రుణబాధలు తొలగి ఊరట చెందుతాయి. వస్తు, వస్త్ర, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు.

కన్య

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది. సన్నిహితుల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. స్వల్ప ధనలాభం ఉంది.

తుల

ఇంటా బయటా చికాకులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చికం

శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాల్లో అనుకూల మలుపులు చోటు చేసుకుంటాయి.

ధనుస్సు

బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం పొందుతారు.

మకరం

ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. విందు వినోదాల్లో, శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.

కుంభం

అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ఉద్యోగాల్లో చిక్కులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. నూతన వస్తు సేకరణ సూచన కలదు.

మీనం

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. తండ్రి నుంచి ఆస్తి లాభం పొందుతారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

TSPSC Paper Leak | ఏఈ పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ మొబైల్‌లో యువతుల ఫోన్ నంబర్లు, నగ్న చిత్రాలు

Mohammed Siraj | గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని: సిరాజ్‌

Exit mobile version