Home Latest News TSPSC Paper Leak | ఏఈ పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ మొబైల్‌లో యువతుల ఫోన్...

TSPSC Paper Leak | ఏఈ పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ మొబైల్‌లో యువతుల ఫోన్ నంబర్లు, నగ్న చిత్రాలు

TSPSC Paper Leak | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( టీఎస్పీఎస్సీ ) ఏఈ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది గవర్నమెంట్ టీచర్ అయిన రేణుక వలపు వలలో చిక్కుకుని పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. ప్రవీణ్ మొబైల్‌లో పలువురు యువతుల నగ్న చిత్రాలు లభ్యమయ్యాయి.

నిందితుడు ప్రవీణ్ కారుణ్య నియామక ప్రక్రియ ద్వారా 2017లో టీఎస్పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరాడు. సుమారు 4 సంవత్సరాల పాటు వెరిఫికేషన్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చే పలువురు మహిళలతో ప్రవీణ్ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వారి సెల్‌ ఫోన్‌ నెంబర్లు సంపాదించి వారితో నిత్యం టచ్‌ లో ఉండేవాడు. అంతేకాకుండా వారిలో కొంతమందితో అతను శారీరక సంబంధం కూడా ఏర్పరచుకున్నాడు. ప్రవీణ్‌ సెల్‌ ఫోన్‌ నిండా మహిళల నెంబర్లతో పాటు వారితో చేసిన చాటింగ్‌ను పోలీసులు గుర్తించారు. వాటిలో కూడా ఎక్కువగా మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలోనే తనతో సన్నిహితంగా ఉన్న రేణుక కోసమే ప్రవీణ్ ఏఈ ప్రశ్నపత్రం లీక్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నపత్రం కూడా ప్రవీణ్ లీక్ చేసినట్లు తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఏఈ ప్రశ్నపత్రం లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుకా సహా 9 మంది అరెస్ట్ అయ్యారు. మరో వైపు పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అలర్ట్ అయ్యారు. దీనిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పేపర్ ఎలా లీక్ అయింది.. దీనికి కారకులు ఎవరు.. ఇప్పటి వరకు దర్యాప్తు ఎంత వరకూ వచ్చింది.. ఎంత మంది అరెస్ట్ అయ్యారు.. వంటి కీలక విషయాలపై ఆరా తీయనున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSPSC | టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు – Time2news.com

TSPSC Group 1 Question Paper Leak | గ్రూప్ 1 పేపర్‌ కూడా లీక్ అయిందా.. నిందితుడు ప్రవీణ్‌కు 103 మార్కులు ఎలా వచ్చాయి ?

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Exit mobile version