Home Lifestyle Health Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

Obesity

Obesity | చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతిఒక్కరూ ఇప్పుడు ఆధునిక జీవన శైలికి అలవాటు పడ్డారు. పిజ్జాలు, బర్గర్లు, ఫాస్టుఫుడ్డులు, బిర్యానీలు అంటూ వేళాపాలా లేకుండా లాగించేస్తున్నారు. ఫలితంగా ఉండాల్సిన దానికంటే కంటే ఎక్కువ బరువు పెరిగి అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. బరువు తగ్గించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే ఈ సింపుల్‌ చిట్కాలు పాటిస్తే సులువుగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా చిట్కాలు అని ఓసారి పరిశీలిస్తే..

ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాయామం చేయడంతో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. కానీ ఏది మంచి ఆహారం..? ఏది తింటే బరువు తగ్గొచ్చు అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఫలితంగా ఎంత వ్యాయామం చేసినా వృథా అవుతోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి భోజనానికి బదులుగా వీటిని తీసుకుంటే సులువగా బరువు తగ్గొచ్చు..

కీరదోస:
బరువును తగ్గించే ఉత్యుత్తమ ఆహార పదార్థాల్లో కీరదోస ఒకటి. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనానికి బదులుగా కూడా కీరదోసను తీసుకోవచ్చు. దీని వల్ల చర్మం కూడా మెరిసిపోతుంటుంది. కొన్ని తిన్నా కూడా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. త్వరగా ఆకలి కాదు. కాబట్టి కీరదోసను రాత్రివేళల్లో బరువు తగ్గే ఛాన్స్‌ ఉంటుంది.

కాలిఫ్లవర్‌:
కాలిఫ్లవర్‌ తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ముఖ్యంగా రాత్రి పూట తింటే త్వరగా బరువు తగ్గే ఛాన్స్‌ ఉంది.

స్ట్రాబెర్రీలు:
స్ట్రాబెర్రీల్లో విటమిన్లు, ఫైబర్‌ అధికంగా ఉంటుంది. వీటిలో పాలీఫైనాల్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అంటువ్యాధుల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో కొలెస్ట్రాల్‌ ఉండదు. విటమిన్‌ సీ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారడంతో పాటు చర్మ సమస్యలు ఎక్కువగా రావు. యవ్వనంగా కనిపిస్తారు. ముఖ్యంగా వంద గ్రాముల స్ట్రాబెర్రీలను తింటే కేవలం 33 క్యాలరీలే వస్తాయి. త్వరగా కడుపు నిండిన ఫీలింగ్‌ కలుగుతుంది. త్వరగా ఆకలి కూడా వేయదు. కాబట్టి బరువు తగ్గించుకోవచ్చు.

ఎరుపు రంగు కాప్సికం:
ఎరుపు రంగులో ఉండే కాప్సికం తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి రాత్రి వేళల్లో తింటే బరువు తగ్గుతారు. అయితే ఇందులో విటమిన్‌ ఏ, సీ, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచటంతో పాటు కంటి చూపును కూడా మెరుగు పరుస్తుంది.

పుట్టగొడుగులు:
ఉబకాయంతో బాధపడేవారు పుట్టగొడుగులు తింటే మేలు. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని బయటకు పంపించి.. లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ని తీసేయడం వల్ల రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది. ముఖ్యంగా బీపీ ఎక్కువగా ఉన్నవాళ్లు పుట్టగొడుగులు తినడం బెటర్.

Follow Us : Facebook, Twitter

Read More Articles |

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Rising Dengue Cases | డెంగీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరిలో దీని ప్రభావం ఎక్కువ ?

చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

Exit mobile version