Home Lifestyle Do you know vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

vaasthu tips | గుళ్లు గోపురాలకు సమీపంలో ఇల్లు కట్టుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. వాటి నీడ ఇంటి మీద పడితే మంచిది కాదని అంటారు. అందుకే ఆలయాలకు దూరంగా ఇళ్ల నిర్మాణం చేపడుతుంటారు. అసలు ఆలయాలు అంటేనే పాజిటివ్ ఎనర్జీ, ప్రశాంతతకు నిలయం కదా.. మరి అలాంటి పవిత్ర స్థలానికి సమీపంలో ఇల్లు ఎందుకు కట్టుకోవద్దు? దీని వెనుక ఉన్న కారణమేంటి? ఒకసారి చూద్దాం..

ఆలయాలను ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మిస్తారు. దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్ఠించే ముందు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మూల విరాట్టును ప్రతిష్ఠించేటప్పుడే మహాశక్తులను గర్భగుడిలో నిక్షిప్తం చేస్తారు. దీనికి శక్తివంతమైన యంత్రబలం, మంత్ర బలం తోడై బలీయమైన శక్తిగా ఏర్పడుతుంది. ఇది ఆ ఆలయం చుట్టూ ప్రసరిస్తుంది. ధ్వజస్తంభం ఉన్న దేవాలయాల్లో ఇలాంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిని తట్టుకోవడం సాధ్యం కాదు. అందుకే ఆలయాలకు సమీపంలో ఇళ్లను కట్టుకోవద్దని చెబుతుంటారు.

మూఢ నమ్మకంగా అనిపించినా ఈ నమ్మకం వెనుక శాస్త్రీయ దృక్పథం కూడా ఉంది. ఏటా దేవతలకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మాఢవీధుల్లో భక్తుల సందడి ఉంటుంది. ఊరేగింపులు, బ్రహ్మోత్సవాలు సాఫీగా నిర్వహించాలంటే ఆలయం సమీపంలోని రహదారులు ఖాళీగా ఉండాలి. అంటే సమీపంలో ఎలాంటి ఇండ్లు లేకపోవడమే బెటర్. అదికాకుండా జనావాసాలు ఉన్న చోట జననమరణాలు సహజం. అలాంటి సమయంలో ఆలయాల పవిత్రకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. అందుకే పూర్వకాలంలో ఆలయాలను నివాసాలకు దూరంగా నిర్మించేవారు. కానీ ఇప్పుడు జనాభా పెరిగిపోవడంతో ఆలయాలకు సమీపంలో కూడా ఇండ్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి కనీసం ఆలయాలకు అత్యంత సమీపంలో అయినా ఇల్లు కట్టుకోవద్దనే ఉద్దేశ్యంతో ఇంటిపై గుడి నీడ పడొద్దని చెబుతుంటారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Exit mobile version