Home Business Rupee value | రూపాయి విలువ తగ్గడానికి కారణం అదే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల...

Rupee value | రూపాయి విలువ తగ్గడానికి కారణం అదే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల కీలక వ్యాఖ్యలు

Rupee value | రూపాయి విలువ పడిపోవడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ( Nirmala sitharaman ) కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి విలువ ఇప్పటికే చరిత్రలో ఎప్పుడూ లేనంత కనిష్టానికి పడిపోయిన విషయం తెలిసిందే. దీని గురించి మాట్లాడుతూ.. ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే రూపాయి చాలా మెరుగ్గా ఉందని అన్నారు.

Read more: Digital Rupee | RBI తీసుకొచ్చే డిజిటల్‌ రూపాయితో సామాన్యులకు లాభమేంటి ? ఎవరు వాడొచ్చు.. ఎంత వరకు సురక్షితం?

ముఖ్యంగా రూపాయి బలహీనపడటం లేదని, అమెరికా డాలరే బలపడుతోందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంకు (World bank), వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు నిర్మల అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూపాయి విలువ మరింత క్షీణించకుండా చూస్తామని చెప్పారు. రూపాయి విలువ స్థిరీకరించడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తుందని అన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థను గమనిస్తున్న పలు రేటింగ్ , విశ్లేషణ, ఆర్థిక సంస్థలు భారత ఎకానమీ బలహీనపడేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయని విలేకరుల సమావేశంలో చెప్పారు.

Read more: Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని, ఇతర దేశాల ద్రవోల్బణంతో పోలిస్తే భారత్ లో తక్కువగా ఉందన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Fact Check | 5G వ‌చ్చింద‌ని ఇండియాలో 3జీ, 4జీ మొబైల్స్‌ను ఆపేస్తున్నారా?

Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Exit mobile version