Home Lifestyle Do you know Python massage | కొండ చిలువతో మసాజ్ చేపించుకోవాలనుందా.. అయితే అక్కడికి వెళ్లాల్సిందే!

Python massage | కొండ చిలువతో మసాజ్ చేపించుకోవాలనుందా.. అయితే అక్కడికి వెళ్లాల్సిందే!

Python massage | ఎవరైనా సరే పాములు, కొండ చిలువలను చూస్తే భయపడిపోతారు. మరి అలాంటి వాటితో మసాజ్ చేయించుకోవాలనుందా? అయితే ఫిలిప్పీన్స్ వెళ్లాల్సిందే . అక్కడ కొండ చిలువలతో ప్రత్యేకంగా మసాజ్‌లు చేస్తున్నారు. ఎలాంటి భయం లేకండా హాయిగా అక్కడి పాములు, కొండచిలువలు మసాజ్ చేస్తాయని ఫిజియో థెరపీ సిబ్బంది చెబుతున్నారు.

ఇలా మసాజ్ చేయడానికి కొండచిలువలకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తున్నారట. వినడానికి విడ్డూరంగా అనిపించినా నిజమే అంటున్నారు అక్కడి జూ సిబ్బంది. ఎవరైతే మసాజ్ చేపించుకోవాలనుకుంటున్నారో వారిని ఒక గదిలోకి పంపించి నాలుగైదు కొండచిలువలను వదులుతారట. వాటికి ముందే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్ల ఎలాంటి హాని చేయవని హామీ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి మసాజ్‌ల కోసమే పొడవైన, లావుగా ఉన్న కొండచిలువలను ఎంచుకుని శిక్షణ ఇస్తారట నిర్వహకులు.

కొండచిలువతో మసాజ్.. ఏంటి లాభం?

లావుగా ఉన్న కొండచిలువలు మనిషిని చుట్టేసుకుని, శరీరంపై అటూ ఇటూ తిరగడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి, ఒత్తిడి నుంచి ఉప శమనం లభిస్తుందట. ఇలా 15 నిమిషాల పాటు ఈ పైథాన్ మసాజ్ చేస్తే ఒళ్లు నొప్పులు కూడా దూరమవుతాయంటున్నారు మసాజ్ నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ సిబ్బంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

ప్రమాదకరమైన కొండచిలువలతో మసాజ్ అంటే కాస్త రిస్కే కాబట్టి ముందు జాగ్రత్తగా మసాజ్‌ చేపించుకునే ముందు మనకూ కొన్ని జాగ్రత్తలు చెబుతారట. కొండ చిలువలను మన శరీరంపైకి వదిలే ముందు నిదానంగా శ్వాస తీసుకోవాలట. భయంతో అస్సలు అరవొద్దట. కొండచిలువలు మరీ గట్టిగా చుట్టుకుంటున్నాయని అనిపిస్తే సైగల ద్వారా చెప్పమని ముందే జాగ్రత్తలు చెప్పి లోపలికి పంపిస్తారట. ముఖ్యంగా కొండచిలువలు ఆకలి వేస్తేనే దాడి చేస్తాయి. కాబట్టి మసాజ్‌కి పంపించే ముందే వాటికి కడుపు నిండా ఆహారం పెట్టి మసాజ్‌‌కు పంపిస్తారట. ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగరంలో ఉన్న జూ పార్కులో ఈ పైథాన్ మసాజ్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ఇండోనేషియా, ఇజ్రాయిల్‌లోనూ ఈ మసాజ్ చాలా ఫేమస్. సో.. మీరు పైథాన్ మసాజ్ చేపించుకోవాలంటే ఫిలిప్పీన్స్ వెళ్లండి మరి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Is eggs good in winter | చలికాలంలో గుడ్లను తినడం మంచిదేనా?

Bath in winter | చలికాలంలో వేడినీటి స్నానం చేస్తే మంచిదా? చన్నీటి స్నానమా?

Eyestrain | ఫోన్లను ఎక్కువసేపు చూసినప్పుడు కళ్లు మండుతున్నాయా?

Exit mobile version