Home Lifestyle Health Health Tips | ఈ లక్షణాలుంటే లివర్‌ జబ్బుగా అనుమానించొచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కాలేయాన్ని...

Health Tips | ఈ లక్షణాలుంటే లివర్‌ జబ్బుగా అనుమానించొచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కాలేయాన్ని కాపాడుకోవచ్చు!

Health Tips | శరీరంలో పవర్‌హౌజ్‌లా పనిచేసేది కాలేయం. అలాంటి కాలేయానికి జబ్బొస్తే.. ప్రాణాలకే ప్రమాదం. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కాలేయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. ఇంతకీ లివర్‌ జబ్బు రావడానికి కారణాలేంటి? వాటి నుంచి ఎలా బయటపడొచ్చు..

లివర్‌ జబ్బుకు కారణాలివే..

సాధారణంగా కలుషిత ఆహారం, కలుషిత నీరు, ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయ జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. కలుషితమైన రక్తాన్ని ఎక్కించడం వల్ల, ఒకరి సిరంజీలను మరొకరికి ఉపయోగించడం వల్ల కూడా వస్తాయి. ఆల్కహాల్‌ , జంక్‌ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కాలేయ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇన్ఫెక్షన్లు ఉన్న వ్యక్తులతో లైంగిక సంబంధాలు కొనసాగించడం వల్ల కూడా దీనికి కారణమే. జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్‌ వేసుకోవడం కామనే. కానీ అధిక మోతాదులో అదే పనిగా వేసుకుంటే కాలేయంపై ప్రభావం పడుతుంది.

లివర్‌ వ్యాధిని ఎలా గుర్తించాలి

తరచుగా వాంతులు కావడం కూడా లివర్‌ జబ్బు పడిందనడానికి సూచనగా పరిగణించవచ్చు. జ్వరం ఎక్కువగా రావడం, కడుపులో నొప్పి, బరువు తగ్గడం, శరీరంపై దురద రావడం కూడా కాలేయ జబ్బుకు సూచనలే.

లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే..

ప్రతిరోజు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడంతో పాటు రోజుకు 7-8 గ్లాసుల నీళ్లు తాగాలి. బరువు పెరగకుండా వ్యాయామం చేస్తుండాలి. జంక్‌ఫుడ్స్‌కి దూరంగా ఉంటే బెటర్‌, మధ్యపానం, దూమపానానికి దూరంగా ఉండాలి. తాజా ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.

Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వైద్యులను సంప్రదించి వారు సూచనలు, సలహాలను పాటించడం ఉత్తమం.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Beauty tips for lips | చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

Health Tips | నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. కారణాలు ఇవే కావచ్చు! ఒకసారి చెక్ చేసుకోండి..

Exit mobile version