Sunday, April 28, 2024
- Advertisment -
HomeLifestyleDevotionalLakshmi Devi | లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేముందు కనిపించే సంకేతాలివే..

Lakshmi Devi | లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేముందు కనిపించే సంకేతాలివే..

Lakshmi Devi | ఏ ఇంట్లో అయితే గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో ఉండేందుకు లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. అలాంటి ఇంటికే లక్ష్మీదేవి వస్తుంది. అయితే ఇలా ఒక ఇంట్లోకి వచ్చే ముందు కచ్చితంగా చెప్పే వస్తుంది. దీనికోసం ముందుగానే కొన్ని సంకేతాలు పంపిస్తుంది. వాటి ఆధారంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని అర్థం చేసుకోవచ్చు.

ఇంట్లో నల్లచీమలు ఉంటే శుభసూచికంగా భావించవచ్చు. నోటిలో బియ్యం లేదా ఇతరత్రా ధాన్యాన్ని తీసుకెళ్లడం గమనిస్తే మహాలక్ష్మీ ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉందని అర్థం. అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే మంచిది కాదు. దీనివల్ల అప్పు భారం పెరిగే అవకాశం ఉంటుంది.

ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతమే. అలాగే మన ఇంటి ఆవరణలో కోయిల కూత కూడా ధనానికి శుభసూచికగా చెబుతారు. సాయంత్రం పూట ఆగ్నేయ దిశగా కోయిల కోత వినిపిస్తే మంచిది. అదే ఉదయం పూట కూత వినిపిస్తే నష్టం జరుగుతుంది.

బల్లి మీద పడితే అశుభమని భావిస్తారు. కానీ బల్లి మీ కుడి చేతి మీద పడి త్వరత్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆర్థికంగా పురోగతి సాధిస్తారని పండితులు చెబుతున్నారు. ఒకే చోట మూడు బల్లులు కనిపించడం కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమే. దీపావళి రోజు తులసి చెట్టు దగ్గర బల్లి కనబడితే కష్టాలు తొలగిపోతాయి. అయితే ఒకటి కంటే ఎక్కువ బల్లులు తులసి చెట్టు దగ్గర కనిపిస్తే ధన నష్టం జరుగుతుంది.

కుడి చేతిలో ఎప్పుడూ దురదగా ఉండటం కూడా ధనలక్ష్మీ వచ్చే ముందు కనిపించే సంకేతమే అని పెద్దలు చెబుతున్నారు. ఇంట్లో రెండు ముఖాల పాము కనిపించడం కూడా శుభసూచికమేనట.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News