Sunday, April 14, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuDaily Horoscope | రాశిఫలాలు (31-03-2023 )

Daily Horoscope | రాశిఫలాలు (31-03-2023 )

Daily Horoscope | మేషం

పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుంచి నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు.

వృషభం

మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం సంతృప్తినిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు.

మిథునం

పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయం అవుతారు. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఎదురైన చిక్కులు పరిష్కారమవుతాయి. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

కర్కాటకం

శ్రమ అధికంగా ఉన్నా పనుల్లో తొందరపాటు వద్దు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి ధన సహాయం అందుకుంటారు. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.

సింహం

కొత్త వ్యక్తులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు అందుతాయి. వివాహ యత్నాలకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధనలాభం పొందుతారు.

కన్య

దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగాల్లో ఏర్పడిన చికాకులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబసభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

తుల

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం లభిస్తుంది. పెట్టుబడులకు అనుకూలమైన కాలం. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

పనులు నిదానంగా సాగుతాయి. కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో మెలకువ అవసరం. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు వింటారు.

ధనుస్సు

ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి. సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో ప్రగతి సాధిస్తారు.

మకరం

విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కుంభం

ముఖ్య వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం

ప్రముఖులను కలుసుకుంటారు. ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయమవుతారు. తొందరపాటు వద్దు. శ్రమ మీది ఫలితం వేరొకరిది అన్నట్టు ఉంటుంది. ఉద్యోగాల్లో ఎదురైనా ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News