Home Latest News Fact Check | 5G వ‌చ్చింద‌ని ఇండియాలో 3జీ, 4జీ మొబైల్స్‌ను ఆపేస్తున్నారా?

Fact Check | 5G వ‌చ్చింద‌ని ఇండియాలో 3జీ, 4జీ మొబైల్స్‌ను ఆపేస్తున్నారా?

Fact Check | ఏంటి? భార‌త్‌లో 3జీ, 4జీ మొబైల్ ఫోన్ల ఉత్ప‌త్తిని నిలిపివేస్తున్నారా? ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. మ‌న దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఎయిర్‌టెల్‌, జియో టెలికం కంపెనీలు ఇటీవ‌ల‌ 5జీ నెట్‌వ‌ర్క్‌ను ప్ర‌యోగాత్మ‌కంగా లాంఛ్ చేసింది. తొంద‌ర‌లోనే దేశంలోని అన్ని న‌గ‌రాల‌కు 5జీని విస్త‌రించాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 3జీ, 4జీ మొబైల్ ఫోన్ల ఉత్ప‌త్తిని ఆపేయాల‌ని త‌యారీ సంస్థ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింద‌న్న పోస్టు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారింది. దీంతో అస‌లు ఈ వార్త నిజ‌మేనా? అన్న దానిపై ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో ప‌రిశోధ‌న చేసి.. అస‌లు నిజాన్ని వెల్ల‌డించింది.

3జీ, 4జీ మొబైల్ తయారీని ఆపేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలిచ్చింద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న వార్త అబద్ధ‌మ‌ని పీఐబీ తేల్చింది. మొబైల్ త‌యారీ కంపెనీల‌కు ప్ర‌భుత్వం ఇలాంటి మార్గ‌ద‌ర్శ‌కాలు ఏవీ ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న విష‌యాల గురించి ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. విశ్వ‌సనీయ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన స‌మాచారాన్నే తెలుసుకోవాల‌ని చెబుతోంది.

Follow Us : Facebook, Twitter

Read More Articles |

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Anklets | ఆడపిల్లలు కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి.. బంగారు పట్టీలు ధరిస్తే ఏమవుతుంది?

Digital Rupee | RBI తీసుకొచ్చే డిజిటల్‌ రూపాయితో సామాన్యులకు లాభమేంటి ? ఎవరు వాడొచ్చు..

Exit mobile version