Home Lifestyle Horoscope & Vaasthu Moles | మగాళ్లకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే సంసారం సరదాగా సాగిపోతుంది

Moles | మగాళ్లకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే సంసారం సరదాగా సాగిపోతుంది

Moles | పుట్టుమచ్చలు కూడా మన మొహానికి అందాన్ని ఇస్తాయి. పెదవి కింద, ముక్కుపై ఉండే మచ్చలు కొన్నిసార్లు అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయి. అయితే ఇవి అందానికే కాదు మన అదృష్టం మీద కూడా ప్రభావం చూపిస్తుంటాయి. మన శరీరంపై ఒక్క ప్లేస్‌లో ఉండే ఒక్కో మచ్చ మన జీవితం మీద ఒక్కోలా ప్రభావం చూపిస్తాయని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతోంది. దాని ప్రకారం మొహంపై వివిధ చోట్ల ఉండే పుట్టుమచ్చలు మనపై ఎలా ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మొహంపై కుడివైపు మచ్చలు ఉంటే పురుషులకు కలిసొస్తుంది. నల్లటి మచ్చ కంటే కూడా గోధుమ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటే శుభ సంకేతం అని పండితులు చెబుతున్నారు.

కనుబొమ్మల వద్ద ఉండే పుట్టుమచ్చలు శుభానికి సూచికలు. కనుబొమ్మల చివరన పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసొస్తుంది. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కనుబొమ్మ మధ్యలో ఉంటే దీర్ఘాయుషు లభిస్తుంది. కనుబొమ్మల మీద ఉంటే మంచి భార్య దొరుకుతుంది. ఆమె మూలంగా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కంటి లోపల పుట్టుమచ్చ ఉంటే ఆస్తిపాస్తులు సిద్ధిస్తాయి.

చెంప మీద పుట్టుమచ్చ ఉన్న పురుషులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అదే ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఇంకా చెప్పాలంటే కాస్త పొగరుగా కనిపిస్తారు.

పెదాలకు కుడి వైపు పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసొస్తుంది. దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.

చెవి మీద లేదా చెవి లోపట పుట్టుమచ్చ ఉంటే కూడా అదృష్టమే. ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

Exit mobile version