Home Lifestyle Devotional Tuesday| మంగళవారం పసుపు కుంకుమ కింద పడితే అశుభమా?

Tuesday| మంగళవారం పసుపు కుంకుమ కింద పడితే అశుభమా?

Image Source : Flipkart

Tuesday| పసుపు కుంకుమ ( Pasupu kumkuma )ను హిందువులు ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. వాటిని అమ్మవారిగానే భావిస్తారు. అందుకే పసుపు కుంకుమ నేల మీద పడకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ఒకవేళ పొరపాటున అవి కింద పడితే అశుభమని భావిస్తారు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం ఇలా అయితే ఏదో కీడు జరుగుతుందని దిగులు చెందుతారు. మరి నిజంగానే పసుపు కుంకుమ కిందపడటం అశుభానికి చిహ్నమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.

పసుపు కుంకుమ కింద పడితే అశుభమనేది కేవలం అపోహ మాత్రమేనని పండితులు చెబుతున్నారు. మంగళ, శుక్రవారమే కాదు ఏ రోజు అవి కింద పడిన శుభసూచికంగానే భావించాలని చెబుతున్నారు. పసుపు కుంకుమ కింద పడితే సాక్షాత్తూ భూమాతకు పసుపు కుంకుమ పెట్టినట్టు అవుతుందని అంటున్నారు. ఎవరైనా ఆడబిడ్డలు ఇంటికి వస్తే పసుపు కుంకుమ పెట్టి ఆహ్వానిస్తాం.. అలాగే పసుపు కుంకుమ కింద పడితే భూమాతనే స్వయంగా మన ఇంటికి వచ్చి తనకు పసుపు కుంకుమ పెట్టమని అడిగినట్టు అని పండితులు చెబుతున్నారు. అదే ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు ఇలా జరిగితే ఎంతో అదృష్టమని అంటున్నారు. శుభకరమే కదా అని పసుపు కుంకుమ కింద పడితే అలాగే వదిలేయకూడదు. కింద పడిన చోట కొద్దిగా బొట్టు ఉంచి.. మిగిలిన దాన్ని ఎవరూ తొక్కని ప్రదేశాల్లో పడేయాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

Exit mobile version