Wednesday, April 17, 2024
- Advertisment -
HomeEntertainmentChatrapathi Movie Teaser | ఛత్రపతి రీమేక్‌ టీజర్ వచ్చేసింది.. ప్రభాస్‌ను బెల్లంకొండ మైమరిపిస్తాడా?

Chatrapathi Movie Teaser | ఛత్రపతి రీమేక్‌ టీజర్ వచ్చేసింది.. ప్రభాస్‌ను బెల్లంకొండ మైమరిపిస్తాడా?

Chatrapathi Movie Teaser | టాలీవుడ్‌లో కమర్షియల్ హీరోగా సక్సెస్ కాకపోయినప్పటికీ.. డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. అక్కడ బెల్లంకొండ శ్రీనివాస్‌కు మంచి ఇమేజ్ ఉంది. ఈయన హిందీ డబ్బింగ్ సినిమాలకు యూట్యూబ్‌లో రికార్డుల వ్యూస్ వస్తున్నాయి. డబ్బింగ్ సినిమాలతో తనకు వచ్చిన పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని డైరెక్ట్‌గా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. దీనికోసం బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతిని నమ్ముకున్నాడు. అల్లుడు శీను సినిమాతో తనను తెలుగులోకి పరిచయం చేసిన వీవీ వినాయక్‌కే ఛత్రపతి రీమేక్ బాధ్యతలు అప్పగించాడు.

రెబల్ స్టార్ ప్రభాస్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన మూవీ ఛత్రపతి. పాన్ వరల్డ్ డైరెక్టర్ కాకహముందు రాజమౌళి తీసిన సినిమా అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటి సినిమాను హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్నానని ప్రకటించినప్పటీ నుంచి అందరిలోనూ ఒక్కటే సందేహం మొదలైంది. ఛత్రపతి అంటే ప్రభాస్ అని ఫిక్సయిన జనాలు.. బెల్లంకొండ శ్రీనివాస్‌ను ఆ క్యారెక్టర్‌కు న్యాయం చేయగలడా? లేడా? అని అందరిలోనూ ఒక అనుమానం ఉండేది. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తాజాగా ఛత్రపతి సినిమా టీజర్‌ను వదిలాడు బెల్లంకొండ శ్రీనివాస్. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్‌ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కు మంచి బజ్ వస్తుంది. భారీ యాక్షన్, మాస్ హంగులతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ లుక్‌కి ఫిదా అవుతున్నారు. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఛత్రపతి రీమేక్ సమ్మర్ కానుకగా మే 12వ తేదీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మరి నటనపరంగా ప్రభాస్‌ను బెల్లంకొండ శ్రీనివాస్ మైమరిపిస్తాడో చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News