Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHealthHealth Tips | రక్తహీనతతో బాధపడుతున్నారా.. ఇదిగో ఇవి తింటే మీ సమస్య తీరినట్టే!

Health Tips | రక్తహీనతతో బాధపడుతున్నారా.. ఇదిగో ఇవి తింటే మీ సమస్య తీరినట్టే!

Health Tips | ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి మనిషికి ఆరోగ్యానికి పెను సవాళ్లనే విసురుతున్నాయి. దాన్ని ఎదుర్కోవాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిందే. ప్రతి పది మంది నలుగురైదుగురు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇలాంటి వారందరూ ఐరన్‌ ఎక్కువ ఉన్న ఆహారపదార్థాలను రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఫలితంగా రక్తహీనత నుంచి విముక్తి అభిస్తుంది. శరీరంలోని అవయవాలకు ఆక్సీజన్‌ బాగా సరఫరా అవుతుంది. అందుకు ఐరన్‌ ఎక్కువున్న ఈ ఆహార పదార్థాను తీసుకోవాలి..

టమాట..

మన శరీరానికి రోజూ కావాల్సిన ఐరన్‌ లో 25శాతం టమాటలను తినడం వల్ల దొరుకుతుంది. మటన్‌ లివర్‌, పల్లీలు, బ్రొకొలి, పిస్తా, బాదంలోనూ ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. బాదంను నానబెట్టి తీసుకుంటే మంచిది.

ఆకుకూరలు

సాధారణంగా ఆకుకూరల్లో ఐరన్‌, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలు, పాలకూరలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ పాలకూరను తినడం వల్ల ఐరన్‌ సంవృద్ధిగా శరీరానికి అందుతుంది. బఠానీ, ఉల్లికాడలు, బీన్స్‌లోనూ ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది.

రాగి అంబలి..

రోజూ ఒక గుడ్డును తీసుకోవడం ద్వారా ఐరన్‌ను పెంచుకోవచ్చు. రక్తహీనత నుంచి బయటపడొచ్చు. యాఫ్రికాట్లు, అవకాడ, ఖర్జూరలో ఎక్కువగా ఐరన్‌ ఉంటుంది. బెల్లాన్ని ప్రతి రోజూ పాలు, టీలో చక్కెరకు బదులు బెల్లాన్ని వేసుకుంటే బెటర్. జొన్నలు, రాగుల్లోనూ ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ రాగి అంబలి, జొన్న రొట్టెలు తీసుకుంటే రక్తహీనత నుంచి బయటపడొచ్చు.

సాధారణంగా మహిళలకు ప్రతి రోజూ 18 మిల్లీ గ్రాముల ఐరన్ అవసరం. గర్భిణిలు రోజూ 27 మిల్లీ గ్రాముల ఐరన్‌ తీసుకోవాలి. 50 ఏళ్ల వయసులోపు ఉన్నవారికి 8 మిల్లీ గ్రాముల ఐరన్‌ సరిపోతుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Postpartum Hair loss | డెలివరీ తర్వాత జుట్టు ఊడిపోతుందా? ఈ టిప్స్‌ మీకోసమే..

Is eggs good in winter | చలికాలంలో గుడ్లను తినడం మంచిదేనా?

Hair fall | రాత్రి పూట తలస్నానం చేస్తున్నారా? బట్టతల వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త

Health Tips | ఈ లక్షణాలుంటే లివర్‌ జబ్బుగా అనుమానించొచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కాలేయాన్ని కాపాడుకోవచ్చు!

Skin care | చర్మ వ్యాధులతో బాధపడుతున్నారా? ఇంట్లో దొరికే ఈ వస్తువులతో సులువుగా నివారించుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News