Tuesday, March 19, 2024
- Advertisment -
HomeLifestyleHealthSkin care | చర్మ వ్యాధులతో బాధపడుతున్నారా? ఇంట్లో దొరికే ఈ వస్తువులతో సులువుగా నివారించుకోండి

Skin care | చర్మ వ్యాధులతో బాధపడుతున్నారా? ఇంట్లో దొరికే ఈ వస్తువులతో సులువుగా నివారించుకోండి

Skin care | శరీరంలో ఏ అవయవానికి అనారోగ్యం వచ్చినా తొందరగా తగ్గిపోతుంది. కానీ చర్మానికి వస్తే మాత్రం తగ్గడం చాలా కష్టం. అందుకే వ్యాధులు రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడాలి. ఒకవేళ చర్మంపై మచ్చలు, దురద వంటి సమస్యలు ఎదురైతే వాటి నుంచి సహజసిద్ధమైన పద్ధతుల్లో నివారించుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. ఆ నివారణ మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

➣ చర్మం ఆరోగ్యానికి మినుములు కీలక పాత్ర పోషిస్తాయి. మినుములను నూరి పట్టిస్తుంటే క్రమంగా తెల్లబొల్లి మచ్చలు తొలిగిపోతాయి.

➣ తులసి ఆకు రసంలో హారతి కర్పూరం కలిపి మెత్తగా నూరాలి. ఆ మిశ్రమాన్ని మచ్చలపై రుద్ది ఆరిన తర్వాత స్నానం చేస్తే శోభి తగ్గిపోతుంది. తులసి, నిమ్మరసం కలిపి నూరి రాసుకుంటే గజ్జి, తామర, దురద నుంచి ఉపశమనం కలుగుతుంది. రాత్రి పడుకునేటప్పుడు ఈ మిశ్రమాన్ని మచ్చలకు పట్టించి, ఉదయం స్నానం చేసేటప్పుడు కడిగేయాలి. రోజూ క్రమం తప్పకుండా రెండు మూడు వారాలు చేస్తే మచ్చలు తొలగిపోతాయి.

➣ చర్మంపై కిరసనాయిల్‌ తరచూ రాస్తే గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

➣ నీళ్లలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిసి స్నానం చేస్తే దురుద తగ్గిపోతుంది. చర్మం నిగారిస్తుంది.
తెల్లగన్నేరు ఆకులను మెత్తగా నూరి తెల్ల మచ్చల మీద రాసుకుంటే ఫలితం ఉంటుంది. జిల్లేడు పాలు, ఆముదాన్ని కలిపి కాలికి రుద్దుకుంటే ఆనెల నుంచి ఉపశమనం కలుగుతుంది.

➣ వామును నిప్పుల మీద వేసి ఆ పొగను ఒంటికి పట్టటిస్తే దురద, దద్దుర్లు తగ్గిపోతాయి.
పసుపు పొడి ఒక వంతు, ఉసిరి పొడి రెండు వంతులను కలిపి మంచి నీటితో సేవిస్తే రక్తం శుద్ధి చెందుతుంది.

➣ శరీరంలో ఇరుక్కున్న ముళ్లు బయటకు రావడానికి మారేడు ఆకులు చక్కగా పనిచేస్తాయి. మారేడు ఆకులను ముద్దగా నూరి కడితే రక్తం శుద్ది అవుతుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vasthu | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

Most dangerous snake | ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ పాము.. ఇది కాటేస్తే 100 మంది బలికావాల్సిందే

Roanoke mystery | ఊరుకు ఊరే మాయమైంది.. అక్కడి జనం ఏమైపోయారో ఇప్పటికీ మిస్టరీనే !!

How to wash silk sarees | పట్టుబట్టలపై మరకలు పడ్డాయా? ఈ చిట్కాలతో సులువుగా పోగొట్టుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News