Home Lifestyle Devotional Lord shiva | సోమవారం ఈ పనులు చేస్తే శివాగ్రహానికి గురికాక తప్పదు

Lord shiva | సోమవారం ఈ పనులు చేస్తే శివాగ్రహానికి గురికాక తప్పదు

Lord shiva | సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. శివానుగ్రహం కోసం అందుకే చాలామంది సోమవారం ఉపవాసం ఉంటారు. ముక్కంటికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే శివుణ్ని పూజిస్తూ నిష్టగా ఉండే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధమని పండితులు చెబుతుంటారు. పొరపాటున ఆ పనులు చేస్తే శివాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తుంటారు. కాబట్టి పరమశివుడిని ఆరాధించే భక్తులు సోమవారం కొన్ని పనులను అస్సలు చేయకూడదు. మరి ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సోమవారం రోజు ఇంట్లోకి పాము వస్తే చంపకూడదని పండితులు చెబుతున్నారు. వాసుకి అనే పామును శివుడు ధరిస్తాడు. కాబట్టి ఈ రోజు పాములను చంపితే ప్రతికూలత ఇంట్లోకి చేరుతుందని.. అన్నీ నష్టాలే జరుగుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇంట్లోకి పాము వస్తే దాన్ని ఎలాగోలా బయటకు వెళ్లే ప్రయత్నాలు చేయాలి తప్ప చంపవద్దని సూచిస్తున్నారు.

శివుడి అనుగ్రహం కోసం కొంతమంది సోమవారం ఉపవాస దీక్ష తీసుకుంటారు. కానీ దీక్ష పూర్తవ్వకముందే ఆకలి అవుతుందని మధ్యలో ఏదో ఒకటి తినేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడి కోపానికి గురికావాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. సోమవారం ఉపవాస దీక్ష తీసుకుంటే కచ్చితంగా నిష్ఠతో పూర్తి చేయాలని సూచిస్తున్నారు.

శివుడిని ఆరాధించే భక్తులు సోమవారం పూజలు చేస్తారు. ఉపవాసం ఉంటారు. అన్ని అయిపోయిన తర్వాత సాయంత్రం నాన్‌వెజ్‌ తింటుంటారు. కానీ అలా చేయకూడదట. ఉపవాసం లేకపోయినా సరే సోమవారం నాన్‌ వెజ్‌ తినకూడదు. కేవలం శాఖాహారం మాత్రమే తినాలి.

కొందరు షేవింగ్‌, కటింగ్‌ సోమవారం చేయించుకుంటారు. కానీ శాస్త్రాల ప్రకారం ఈరోజు క్షౌరం తీసుకోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

Exit mobile version