Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentSaipallavi | సాయిపల్లవికి ఏమైంది.. ఛాన్సులు రావడం లేదా? తనే ఒప్పుకోవడం లేదా?

Saipallavi | సాయిపల్లవికి ఏమైంది.. ఛాన్సులు రావడం లేదా? తనే ఒప్పుకోవడం లేదా?

Saipallavi | గ్లామర్ పాత్రలకే హీరోయిన్లు మక్కువ చూపుతున్న ఈ తరంలో సాయి పల్లవి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా నటన ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తుంది. అవకాశాలు రాకపోయినా ఫర్వాలేదు కానీ, గ్లామర్ పాత్రలను మాత్రం చేయనంటే చేయనని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయిపల్లవి.. మొదటి సినిమాతోనే అందరిని దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయిలా ప్రేక్షకులకు దగ్గరైంది. తన నటన, డ్యాన్స్‌లతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

కేవలం నటన ప్రాధాన్యమున్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ పోవడం వల్ల సాయి పల్లవికి అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఎందుకంటే అలాంటి పాత్రలు ఉన్న కథలు చాలా తక్కువగా తయారవుతూ ఉంటాయి. దాంతో ఈ అమ్మడికి అవకాశాల కొరత ఏర్పడుతుంది. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. గతేడాది సాయిపల్లవి నటించిన విరాటపర్వం, గార్గి రెండు సినిమాలు కమర్షియల్‌గా పెయిల్యూర్‌గా మిగిలాయి. ఈ రెండు సినిమాలు బెడిసి కొట్టడంతో సాయిపల్లవితో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలంటే దర్శక, నిర్మాతలు ఆలోచిస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

ఒకప్పుడు తెలుగులో ఎక్స్‌ప్రెస్‌ బండిలా దూసుకుపోయిన సాయి పల్లవి కెరీర్ ఇప్పుడు పూర్తిగా డల్ అయింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా సాయిపల్లవి పేరు కూడా తెలుగులో వినిపించడం లేదు. అసలు అమెకు ఎవరూ పాత్రలు ఆఫర్ చేయడం లేదా.. లేక తనకే నచ్చిన పాత్రలు రాకపోవడంతో ఆఫర్లను తిరస్కరిస్తుందా అనేది తెలియట్లేదు. ఏదేమైనా ఇలానే ఉంటే సాయిపల్లవి సినీ కెరీర్‌కు త్వరలోనే ఫుల్‌స్టాప్‌ పడే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Aishwarya lekshmi | విలన్‌తో ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో ఉందా? ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుకు అర్థమేంటి?

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

Upasana Konidela | పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్ అయిన ఉపాసన.. ట్వీట్ వైరల్

Srinidhi shetty | కేజీఎఫ్ బ్యూటీకి టాలీవుడ్ నుండి భారీ ఆఫర్.. ఇక్కడైనా అదృష్టం కలిసి వస్తుందా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News