Home Entertainment Laththi Review | లాఠీ సినిమా రివ్యూ.. ఈసారైన విశాల్ హిట్ కొట్టాడా?

Laththi Review | లాఠీ సినిమా రివ్యూ.. ఈసారైన విశాల్ హిట్ కొట్టాడా?

Laththi Review | విశాల్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పందెం కోడి, పొగరు, సెల్యూట్ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌లను ఎంచుకుని తీయడంతో విశాల్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. కానీ కొన్నేళ్లుగా ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోతున్నాయి. దీంతో ఎలాగైనా సక్సెస్ సాధించాలనే కసితో ఒక కొత్త కాన్సెప్ట్‌తో వచ్చాడు. సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో విశాల్ నటించిన లాఠీ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా విశాల్‌కు పునర్వైభవం తీసుకొస్తుందా? ఫ్యాన్స్‌ను ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ ఏంటంటే..

మురళీకృష్ణ ( విశాల్) సాధారణ పోలీస్ కానిస్టేబుల్. నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుంటాడు. పై ఆదేశాల మేరకు ఓ అత్యాచార కేసులో యువకుడిని మురళీకృష్ణ చితకబాదుతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా సస్పెండ్ అవుతాడు. దీంతో మళ్లీ తనను విధుల్లోకి తీసుకోవాలని పైఅధికారుల చుట్టూ తిరుగుతుంటాడు. అతని సిన్సియారిటీ తెలిసి ఆరు నెలల తర్వాత డీఐజీ కమల్ ( ప్రభు) సస్పెండ్ ఎత్తివేయిస్తాడు.మురళీకృష్ణ మళ్లీ డ్యూటీలో చేరతాడు. ఈ క్రమంలో డీఐజీ కూతుర్ని సిటీలోని ఓ రౌడీ శూర కొడుకు వీర అవమానిస్తాడు. దీంతో అవకాశం చూసుకుని వీరను మురళీకృష్ణతో కొట్టిస్తాడు. దీంతో మురళీకృష్ణపై పగ పడతాడు. అతన్ని టార్గెట్ చేస్తాడు.ఓ సాధారణ కానిస్టేబుల్ అయిన మురళీకృష్ణ రౌడీల గుంపును ఎలా ఎదుర్కొన్నాడు. వాళ్ల బారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

ఇలాంటి రివేంజ్ డ్రామాలు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కాకపోతే ఇందులో కథ మొత్తం ఒక సాధారణ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. ఒక కానిస్టేబుల్‌కు సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనే చిన్న కథాంశంతో సాగుతుంది. కానిస్టేబుల్ జీవితం ఎలా ఉంటుందనేది రియలిస్టిక్‌గా చూపించాడు.విశాల్ సినిమా అంటే యాక్షన్ సీక్వెన్స్‌లు పుష్కలంగా ఉంటాయని ఆడియన్స్ అనుకుంటారు. లాఠీ సినిమాలో కూడా కావాల్సినన్నీ ఉన్నాయి. దాదాపు 30 నిమిషాల పాటు సుదీర్ఘమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి.

కథనే వాస్తవానికి చాలా దూరంగా కనిపిస్తుంది.తనను కొట్టించిన డీఐజీపై కాకుండా.. పైఅధికారి చెబితే కొట్టిన కానిస్టేబుల్‌పై విలన్ పగబడతాడు.అలా ఎందుకు పగబడతాడో అర్థం కాదు. అసలు తనను కొట్టించిన డీఐజీ గురించి అస్సలు పట్టించుకోడు. ఇదే కాస్త అసహజంగా అనిపిస్తుంది. హీరో, విలన్ మధ్య పగ పుట్టడానికి గల కారణాన్ని ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. ఫస్టాప్ మొత్తం రొటీన్ సీన్స్‌తో సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌కు వస్తే క్లైమాక్స్‌లో యాక్షన్ సీన్స్ సుదీర్ఘంగా సాగుతాయి. ప్రీక్లైమాక్స్‌లో మొదలైన యాక్షన్ సీన్స్‌ మధ్య మధ్యలో తండ్రీకొడుకుల ఎమోషన్‌తో ప్రేక్షకులను సినిమాలో లీనం చేయాలని డైరెక్టర్ అనుకున్నాడు. కానీ అవి అంతగా ఆకట్టుకునే స్థాయిలో లేవు. అక్కడక్కడ డైరెక్టర్ అనుభవరాహిత్యం కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ సుదీర్ఘంగా సాగడంతో అక్కడక్కడ బోరింగ్‌గా అనిపిస్తుంది. కాకపోతే యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే..

ఇలాంటి యాక్షన్ పాత్రలు చేయడం విశాల్‌కు కొత్తేమీ కాదు.. కాకపోతే ఇందులో ఒక పదేళ్ల పిల్లాడికి తండ్రిలా కనిపించాడు. యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టాడు. ఇలాంటి యాక్షన్ అండ్ ఎమోషన్ పాత్రలు వస్తే ఇరగదీస్తానని మరోసారి నిరూపించుకున్నాడు. హీరోయిన్ సునయినకు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ పరిధి మేరకు చక్కగా నటించింది. అందంగా కనిపించింది. విశాల్ కొడుకుగా నటించిన మాస్టర్ లిరిష్ రాఘవ్ కూడా పాత్రలో లీనమయ్యాడు. ప్రభు, మునీష్ కాంత్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ విషయానికొస్తే.. యువన్ శంకర్ రాజా సంగీతం అంతగా ఆకట్టుకోదు. అక్కడక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం, బాలకృష్ణ తోట సినిమాటోగ్రఫీ ఓకే. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తన డెబ్యూ కావడంతో డైరెక్టర్ వినోద్ కుమార్ తను చెప్పాలనుకున్న కథను సరిగ్గా హ్యాండిల్ చేయాలదని అనిపిస్తుంది.

బలాలు

  • విశాల్ నటన
  • యాక్షన్ సీక్వెన్స్

బలహీనతలు

  • రొటీన్ సీన్స్
  • స్లో నరేషన్

చివరగా.. యాక్షన్ ఇష్టపడేవారికి మాత్రమే నచ్చే.. లాఠీ

Follow Us : FacebookTwitter

Read More Articles |

Keerthi bhat | ఈ స్థాయికి రావడానికి ఏదో చేసి ఉంటా అనుకున్నాడు.. అనుమానంతో బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కీర్తి ఎమోషన్‌

Dhamaka | పోటీ వ్యూహంలో రవితేజ.. గెలుపు కోసం గారడీ చేయాల్సిందే..!

Janhvi kapoor | కనీసం వాళ్లు చూసినా బాగుండేది.. జాన్వీకపూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Samantha | సమంత ఇక సినిమాల్లో నటించడం కష్టమేనా? క్లారిటీ ఇచ్చిన పీఆర్‌ టీమ్‌

Exit mobile version