Home Entertainment Kajal Aggarwal | బాలీవుడ్‌లో ఎక్కడ తప్పు జరుగుతుందో చెప్పిన టాలీవుడ్ చందమామ కాజల్

Kajal Aggarwal | బాలీవుడ్‌లో ఎక్కడ తప్పు జరుగుతుందో చెప్పిన టాలీవుడ్ చందమామ కాజల్

Kajal Aggarwal | పెళ్లి చేసుకుని తల్లి కావడంతో సినిమాలకు దూరమైన కాజల్.. చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. వరుస ప్రాజెక్టులు ఒప్పుకుంటూ బిజీగా మారిపోతుంది. ముంబైలో పుట్టి పెరిగిన కాజల్ బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెను ఆదరించింది మాత్రం సౌత్ ఇండస్ట్రీనే. ముఖ్యంగా ఆమెను టాలీవుడ్ చందమామగా చూసింది. స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను కట్టబెట్టింది. అందుకే తెలుగు ఇండస్ట్రీపై కాజల్ కూడా ఆప్యాయత చూపిస్తూనే ఉంది. అందుకే ప్పుడప్పుడూ బాలీవుడ్ అవకాశాలు వస్తే ఉపయోగించుకుంది కానీ టాలీవుడ్‌ను మాత్రం విడిచిపెట్టలేదు. ఇప్పుడు రీఎంట్రీ తర్వాత కూడా ముందుగా తెలుగు సినిమాకే కమిట్‌మెంట్ ఇచ్చింది. తెలుగు ఇండస్ట్రీపై తనకు ఉన్న ప్రేమను చాటుకుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్.. సౌత్ ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది.

రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023లో పాల్గొన్న కాజల్ అగర్వాల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. నేను పుట్టి పెరిగింది ముంబైలో. నా కెరీర్ మొదలైంది కూడా అక్కడే. కానీ నన్ను సౌత్ ఇండస్ట్రీ ఆదరించింది. సౌత్ సినిమాలతోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగాను. తెలుగు, తమిళ చిత్రాలతోనే గుర్తింపు రావడంతో నాకు ఇక్కడి ప్రాంతాలతో ప్రత్యేక అభిమానం ఉంది. హైదరాబాద్, చెన్నై నగరాలను నా సొంతూళ్లలా భావిస్తా. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ వైవిధ్యమైన కథలతో భారతీయ సినీ ఇండస్ట్రీల మీద పైచేయి సాధిస్తుంది. ఇక్కడ ప్రతిభ ఉంటే ఎవరినైనా ఆదరిస్తారు. హీరోయిన్ల పాత్రలకు కూడా గుర్తింపు ఉంటుంది. బాలీవుడ్‌లో అలా కాదు. అక్కడ మంచి సినిమాల్లోనే నటించా. కానీ అక్కడ నీతి, నైతిక విలువలు లోపించాయి. అంటూ ఆ సమ్మిట్‌లో కాజల్ తన అనుభవాలను చెప్పుకొచ్చింది. ఇలా బాలీవుడ్‌ మీద కాజల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IPL 2023 | అట్టహాసంగా ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు.. సందడి చేసిన తమన్నా, రష్మిక మందానా.. హోరెత్తిన తెలుగు పాటలు

Gwyneth Paltrow | ఏడేళ్లు కోర్టు చుట్టూ తిరిగి ఒక్క డాలర్‌ పరిహారం పొందిన ఐరన్‌ మ్యాన్‌ హీరోయిన్‌.. కేసు గెలిచినందుకు ఫుల్‌ హ్యాపీ

Virus Alert | ఆఫ్రికాలో కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్.. సోకిన 24 గంటల్లో ముక్కు నుంచి తీవ్ర రక్తస్త్రావం.. ముగ్గురు మృతి

Mosquito Coil | ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్.. ఢిల్లీలో దారుణం

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Exit mobile version