Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsBiplab Kumar Deb | త్రిపురలో దారుణం.. మాజీ ముఖ్యమంత్రి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు.

Biplab Kumar Deb | త్రిపురలో దారుణం.. మాజీ ముఖ్యమంత్రి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు.

Biplab Kumar Deb | త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ విప్లవ్ కుమార్ దేవ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఇంటికి నిప్పు పెట్టారు. గోమతి జిల్లాలోని ఉదయ్‌పూర్‌లోని విప్లవ్ కుమార్ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా యజ్ఞం చేసేందుకు పూజారులు అక్కడికి వచ్చారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి చేరుకుని పూజారులపై దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కొట్టారు. దాడి విషయం తెలుసుకున్న స్థానికులు పూజారులను రక్షించారు. అయితే విప్లవ్ ఇంటితో పాటు వాహనాలకు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ దాడికి కారణం సీపీఎం నేతలే కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. పోలీసులు భారీగా మోహరించారు. దాడి జరిగిన సమయంలో విప్లవ్ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా, దాడికి పాల్పడిన వారితో కక్రాబన్ ఎమ్మెల్యే రతన్ చక్రవర్తి సమావేశమైనట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

విప్లవ్ దేవ్ 1969 నవంబర్ 25లో జన్మించారు. 1999లో డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడే 16 ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. సాత్నా బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ సెక్రటరీగా పనిచేశారు. 2014 ఎన్నికల సమయంలో మోదీ పోటీ చేసిన వారణాసి నియోజకర్గంలో ప్రచారానికి సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహించారు. దీంతో అధికారంలోకి రాగానే బీజేపీ ఆయనకు త్రిపురలో కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. రెండేళ్లు కష్టపడి 25 ఏళ్ల వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించి.. త్రిపురలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో బీజేపీ ఆయనను 2018లో ముఖ్యమంత్రిని చేసింది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News