Monday, December 11, 2023
- Advertisment -
HomeEntertainmentRajinikanth | ఆమె వల్లే అన్ని అలవాట్లు మానేశా.. రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rajinikanth | ఆమె వల్లే అన్ని అలవాట్లు మానేశా.. రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rajinikanth | సూపర్‌ స్టార్ రజనీకాంత్ సందర్భం వచ్చినప్పుడల్లా తన భార్య లత గురించి అభిమానుల ముందు, మీడియా ముందు ప్రస్తావిస్తూనే ఉంటారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్‌ తన భార్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

చెన్నైలో వైజీ మహేంద్రన్‌ చారుకేసి కార్యక్రమం 50 వ రోజు సంబరాలు జరిగాయి. ఆ వేడుకలో భార్య లతతో కలిసి రజనీకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండస్ట్రీకి వచ్చే రోజులలో తనకున్న చెడు అలవాట్లను గురించి వివరించారు. తాను కండక్టర్‌ గా పని చేసే రోజుల్లో సిగరెట్లు, మద్యపానం, మాంసాహార అలవాట్లు ఉండేవన్నారు. నటుడిగా కెరీర్‌ ను ప్రారంభించిన మొదట్లోనూ ఈ అలవాట్లు కొనసాగినట్లు వివరించారు. కేవలం లత వల్లే వాటిని మానేసినట్లు ఆయన పేర్కొన్నారు.

నాకు లతను పరిచయం చేసిన వైజీ మహేంద్రన్‌ కు జీవితాంతం రుణపడి ఉంటాను. బస్సు కండక్టర్‌ గా ఉన్న రోజుల్లో ప్రతి రోజూ మద్యం తాగేవాడిని. రోజూ ఎన్ని సిగరెట్లు తాగి పడేసేవాడినో లెక్కే ఉండేది కాదు. మాంసాహారంతోనే రోజు మొదలు పెట్టేవాడిని. రోజూ కనీసం రెండు సార్లు మాంసాహార భోజనం తినేవాడిని. ఒకానొక సమయంలో శాకాహారులను చూస్తే బాధపడేవాడిని. కానీ ఈ మూడు చాలా ప్రమాదకరమైనవి. వీటిని ఎక్కువ కాలం పాటు కొనసాగించిన వారు 60 సంవత్సరాల తరువాత ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించలేరు. ఈ విషయంలో నా భార్య లత పాత్ర కీలకం. ఆమె కేవలం తన ప్రేమతో మాత్రమే నేను వాటిని అన్నింటిని మానేసేలా చేసింది. క్రమశిక్షణతో జీవించేలా నన్ను మార్చింది అంటూ రజనీ సభలో వివరించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Job Notifications | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2391 కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TTD | అరచేతిలో వైకుంఠనాథుడి విశేషాలు.. మొబైల్‌లో ఒక్క క్లిక్‌తోనే శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు

Jamuna | టాలీవుడ్‌లో మరో విషాదం.. సినీ నటి జమున కన్నుమూత

Taraka Ratna | నందమూరి తారకరత్నకు గుండెపోటు.. లోకేశ్ యువగళం యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన టీడీపీ నేత

Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News