Friday, March 31, 2023
- Advertisment -
HomeNewsAPRaghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

Raghu kunche | టైమ్2న్యూస్, మధురపూడి ( తూర్పు గోదావరి ): టాలీవుడ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి లక్ష్మీనారాయణరావు (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను బుధవారం స్వగ్రామంలో నిర్వహించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరగాడ గ్రామనికి చెందిన కుంచె లక్ష్మీనారాయణ హోమియో వైద్యుడిగా సేవలందించాడు. స్థానిక సాగునీటి సంఘ అధ్యక్షుడిగా కూడా కొంతకాలం సేవలందించాడు. ఈయనకు కుమారుడు రఘు కుంచె, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇక కుంచె రఘు విషయానికొస్తే బుల్లితెరపై యాంకరింగ్‌తో కెరీర్ మొదలుపెట్టి.. సింగర్‌గా మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. ఒకవైపు సింగర్‌గా రాణిస్తూనే.. యాక్టింగ్‌‌పైనా దృష్టిపెట్టాడు. పలు సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పలాస 1978 సినిమాలో రఘు కుంచె విలనిజం టాలీవుడ్‌లో అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ రఘు కుంచె యాక్టింగ్‌కు మాత్రం మంచి పేరొచ్చింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

Avatar 3 | మీ సీట్ బెల్ట్‌ భద్రంగా ఉంచుకోండి.. అవతార్‌ 3 అద్భుతమైన కాన్సెప్ట్‌తో వస్తుందంటున్న జేమ్స్‌ కామెరూన్‌

Rashmi Gautam | కోడికి లేని బాధ నీకెందుకు.. నెటిజన్‌ కామెంట్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన రష్మి

priyanka jawalkar | పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చినా నటించను.. ప్రియాంక జవాల్కర్ సంచలన వ్యాఖ్యలు

Dil Raju Marriage | దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఇంత కథ ఉందా? ఏడాది వెంటపడి మరీ ప్రపోజ్ చేశాడా?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News