Saturday, July 13, 2024
- Advertisment -
HomeEntertainmentAvatar 3 | మీ సీట్ బెల్ట్‌ భద్రంగా ఉంచుకోండి.. అవతార్‌ 3 అద్భుతమైన కాన్సెప్ట్‌తో...

Avatar 3 | మీ సీట్ బెల్ట్‌ భద్రంగా ఉంచుకోండి.. అవతార్‌ 3 అద్భుతమైన కాన్సెప్ట్‌తో వస్తుందంటున్న జేమ్స్‌ కామెరూన్‌

Avatar 3 | హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ ( hollywood director james cameroon ) అద్భుత సృష్టి అవతార్‌. ఇందులో పండోరా ( pandora ) గ్రహం అందాలను, అక్కడి జీవరాశులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. మొదటి భాగంలో అటవీ అందాలను చూపించిన జేమ్స్‌ కామెరూన్‌.. రెండో పార్ట్‌లో నీటితో గల బంధాన్ని ఆవిష్కరించాడు. దాన్ని కూడా విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దాడు. ఈ రెండు పార్ట్‌లు చూసిన సినీ అభిమానులు.. మూడో భాగం ఎప్పుడు వస్తుందా? అందులో ఏ మాయాజాలం చూపిస్తారా? అని ఆసక్తి చూస్తున్నారు. ఈ క్రమంలోనే థర్డ్‌ పార్ట్‌కు సంబంధించిన స్టోరీ లైన్‌ను జేమ్స్‌ కామెరూన్‌ రివీల్‌ చేశాడు. తర్వాత భాగం అగ్ని ( fire ) ప్రధానంగా ఉండబోతుందని హింట్‌ ఇచ్చాడు.

బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్‌ మూవీ కేటగిరీలో అవతార్‌ 2 సినిమాకు తాజాగా క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన జేమ్స్‌ కామెరూన్‌.. అవతార్‌ మూడో భాగానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ పాయింట్స్‌ను బయటపెట్టాడు. ‘ అగ్ని ఒక చిహ్నం.. జీవరాశులకు ఎంతో ప్రయోజనకారి. అవతార్‌ 3లో ఇదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. సంస్కృతితో మిళితమైన కాన్సెప్ట్‌ ఇది. ఇందులో మరో రెండు సంస్కృతులు పరిచయం అవుతాయి. ఒమక్టయా, మెట్కైనా తెగలను మీరు కలుస్తారు. పండోరాలోనే ఇదొక విభిన్న ప్రదేశం’ అని జేమ్స్‌ కామెరూన్‌ తెలిపాడు. ఇంతకుమించి చెప్పకూడదేమో అంటూ దాన్ని అక్కడికే ఆపేశాడు.

అవతార్‌ 3 సినిమా గురించి కామెరూన్‌ భార్య కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీ సీట్‌ బెల్ట్‌ మరింత భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అవతార్‌ 3 ఎడారిలాంటి ప్రదేశంలో సాగుతుందని సమాచారం. అక్కడి సంపదను సొంతం చేసుకునేందుకు మనుషులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? జేక్‌, అతని కుటుంబం దాన్ని ఎలా అడ్డుకుంది? మనుషుల నుంచి జేక్‌ కుటుంబానికి ఎలాంటి ఆపదలు ఎదురయ్యాయి? వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతుందని హాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.

అవతార్‌ 2తో పాటే అవతార్‌ 3 సినిమా చిత్రీకరణను కూడా జేమ్స్‌ కామెరూన్‌ దాదాపు పూర్తి చేశాడు. కొంత ప్యాచ్‌ వర్క్‌ కూడా మిగిలి పోయినట్టు సమాచారం. ఇది పూర్తయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌ చేయాల్సి ఉంటుంది. దీనికే చాలా సమయం పోతుంది. అయితే ఈ సినిమాను మాత్రం 2024 డిసెంబర్‌లో రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. అంటే అవతార్‌ మూడో భాగాన్ని చూడాలంటే ఇంకో రెండేళ్లు ఆగాల్సిందే అన్నమాట.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

priyanka jawalkar | పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చినా నటించను.. ప్రియాంక జవాల్కర్ సంచలన వ్యాఖ్యలు

Dil Raju Marriage | దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఇంత కథ ఉందా? ఏడాది వెంటపడి మరీ ప్రపోజ్ చేశాడా?

Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News