Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentJabardasth Punch Prasad | అనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ పంచ్ ప్రసాద్‌కు ఎవరు ఎక్కువగా సాయం...

Jabardasth Punch Prasad | అనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ పంచ్ ప్రసాద్‌కు ఎవరు ఎక్కువగా సాయం అందిస్తున్నారు?

Jabardasth Punch Prasad | జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లలో పంచ్ ప్రసాద్ అంటే తెలియని వాళ్లు ఉండరు. స్పాంటెనియస్‌గా పంచ్‌లు వేస్తూ నవ్విస్తూ ప్రసాద్ మంచి పేరు తెచ్చుకున్నాడు. రెండు కిడ్నీలు పాడవ్వడంతో అప్పట్లో చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. తిరిగొచ్చిన తర్వాత తన మీద తాను సెటైర్లు వేసుకుంటూ కూడా అందర్నీ కడుపుబ్బా నవ్వించాడు. కానీ మళ్లీ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం క్షీణించింది. ఇటీవల నడవలేని స్థితిలోకి కూడా చేరడంతో మళ్లీ చికిత్స తీసుకుంటున్నాడు. దీనికోసం చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి.

పంచ్ ప్రసాద్‌కు జబర్దస్త్ షో ద్వారా మాత్రమే డబ్బులు వస్తాయి. అనారోగ్యం కారణంతో షోలకు దూరంగా ఉంటున్నాడు. దీంతో డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న పంచ్ ప్రసాద్‌కు చాలామంది ఆర్థికసాయం అందిస్తున్నారు. చికిత్స కోసం డబ్బులు ఇస్తున్నారు. తోటి కమెడియన్లు వాళ్లకు వీలైనంత ఇచ్చి పంచ్ ప్రసాద్‌ను ఆదుకుంటున్నారు. మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా ఏదో విధంగా పంచ్ ప్రసాద్‌కు సాయం అందిస్తూనే ఉంది. ఈ క్రమంలో పంచ్ ప్రసాద్‌కు సాయం అందించిన వాళ్లకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. పంచ్ ప్రసాద్‌కు ఆర్థికంగా అండగా ఉండి ఎక్కువ సాయం అందించింది సుడిగాలి సుధీర్ అని తెలుస్తోంది. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ఈ ముగ్గురు కలిసి పంచ్ ప్రసాద్‌కు ఇప్పటివరకు రూ.25 లక్షలకు పైగానే ఆర్థిక సాయం అందించారు.

పంచ్ ప్రసాద్‌కు ఒక్కడికే కాదు ఇంకా చాలామందికి సుడిగాలి సుధీర్ సాయం అందించినట్లు తెలుస్తోంది. కెరీర్‌లో ఎదిగే క్రమంలో చాలామంది దగ్గర సుడిగాలి సుధీర్ సాయం పొందాడు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించాడు కూడా. ఇప్పుడు బుల్లితెరపై టాప్‌లో ఉండటంతో పాటు సినిమాలు కూడా చేస్తుండటంతో సుడిగాలి సుధీర్ చేతినిండా సంపాదిస్తున్నాడు. దీంతో తాను పొందిన సహాయాన్ని మరిచిపోకుండా.. కష్టాల్లో ఉన్న తోటి నటీనటులకు తన వంతు సహాయం అందిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వాళ్లంతా సుడిగాలి సుధీర్ మంచి మనసును కొనియాడుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

Bhanupriya | మెమొరీ లాస్‌తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. సెట్స్‌లో డైలాగులు కూడా గుర్తుండట్లేదట

Jabardasth Varsha | రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు.. వీడియో పోస్టు చేసిన జబర్దస్త్ వర్ష.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News