Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentTamannah Bhatia | బాలీవుడ్‌ నటుడితో పెళ్లి పుకార్లు.. దైవ చింతనపై ధ్యాస పెట్టిన తమన్నా.....

Tamannah Bhatia | బాలీవుడ్‌ నటుడితో పెళ్లి పుకార్లు.. దైవ చింతనపై ధ్యాస పెట్టిన తమన్నా.. మొన్న ఏమో హిమాలయాలకు..

Tamannah Bhatia | మిల్క్ బ్యూటీ తమన్నా పెళ్లి విషయం కొద్దిరోజులుగా బీటౌన్‌లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఓ ఏజ్‌కు వచ్చిన హీరోయిన్లు అందరూ పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. ఈ క్రమంలో మిల్క్ బ్యూటీ తమన్నా పెళ్లికి సిద్దమైందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ముంబైకి చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌తో తమన్నా పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అవుతుందని ప్రచారం జరిగింది. వీటిపై తమన్నా సీరియస్‌గానే స్పందించింది. దీంతో కొద్దిరోజులు ఆగినట్లే ఆగి మళ్లీ వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వీటిపై తమన్నా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా తమన్నా ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లింది.

కొద్ది నెలల క్రితం హిమాలయాలకు వెళ్లి అక్కడి ప్రసిద్ధి వైష్ణవి దేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. ఆ ఫొటోలను అప్పట్లో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది తాజాగా ఈషా యోగా సెంటర్‌కు తమన్నా వెళ్లింది. కాషాయ దుస్తులు ధరించి అక్కడి వెళ్లిన మిల్క్ బ్యూటీ లింగభైరవి ని దర్శించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా ఈషా యోగాశ్రమం నుంచి తనకు ఆహ్వానం రావడంతో చాలా సంతోషంగా ఫీలయ్యానని రాసుకొచ్చింది. లింగ భైరవి దేవిని దర్శించుకోవడం మానసికంగా ఉల్లాసాన్ని కలగించిందని చెప్పింది. లింగ భైరవి విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే తమన్నాకు ఇప్పుడు పెళ్లి మీద మనసు మళ్లిందని.. అందుకే కళ్యాణం చేసుకునే ముందు దైవ దర్శనాలు చేసుకుంటుందని ఫిలిం వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

Bhanupriya | మెమొరీ లాస్‌తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. సెట్స్‌లో డైలాగులు కూడా గుర్తుండట్లేదట

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News