Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (11-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు (11-02-2023 )

Horoscope Today | మేషం

పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది. సంతానానికి సంగీత, సాహిత్యాల్లో ప్రవేశం కల్పించాలని నిశ్చయించుకుంటారు.

వృషభం

వాయిదాల మీద వాయిదా పడుతున్న కార్యక్రమాలను సానుకూల పరుచుకుంటారు. చిరుతిండ్లకు ప్రాముఖ్యతను ఇస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచనలు సాగిస్తారు. సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు.

మిథునం

ఉద్యోగపరంగా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పాత రుణాలు వసూలవుతాయి. మీకు ఎంతమాత్రం సంబంధం లేని విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

కర్కాటకం

ధన వ్యయం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలం. జీవితాన్ని కొత్త కోణంలో చూస్తారు. చిన్నపాటి ప్రయాణాలు సాగిస్తారు. గతానుభవం సహాయపడుతుంది.

సింహం

స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ప్రచారంలో ఉన్న పుకార్లను నమ్ముతారు. కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు.

కన్య

సాంకేతిక కారణాల వల్ల అపర్థాలు చోటుచేసుకుంటాయి. బాల్య మిత్రులను కలుసుకుంటారు. స్పెక్యులేషన్‌పరంగా లాభపడే సూచనలు లేవు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి.

తుల

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొనుగోలు అమ్మకాల వల్ల లాభపడతారు. ముఖ పరిచయస్తుల నుంచి మాట సహాయాన్ని తీసుకుంటారు. సమయోచితంగా వ్యవహరిస్తారు.

వృశ్చికం

ఆర్థికంగా ఇబ్బందులేవీ ఏర్పడవు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆహార, ఆరోగ్య నియమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.

ధనుస్సు

పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు ఆలోచింపజేస్తాయి. సుదీర్ఘమైన ఫోన్ సంభాషణలు సాగిస్తారు. ఆప్తులెవరో..మిత్రులెవరో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. దైవ దర్శనం చేసుకుంటారు.

మకరం

గతంలో దూరమైన ఒక వర్గంతో తిరిగి నేడు సఖ్యత ఏర్పడుతుంది. గుప్తదానం చేస్తారు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు.

కుంభం

దురభ్యాసాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. వివాదాల్లోకి మిమ్మల్ని లాగాలని ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి.

మీనం

మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత సాధించగలుగుతారు. క్రీడారంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రణాళికలు, కార్యచరణ సత్ఫలితాలనిస్తాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News