Home Entertainment Balakrishna | NBK 108 విడుదలకు ముహూర్తం పెట్టిన బాలయ్య.. కూతురుగా శ్రీలీల!

Balakrishna | NBK 108 విడుదలకు ముహూర్తం పెట్టిన బాలయ్య.. కూతురుగా శ్రీలీల!

Balakrishna | తారకరత్న హఠాన్మరణం కారణంగా నెల రోజులుగా షూటింగ్ కు దూరంగా ఉన్నాడు బాలకృష్ణ. ఫిబ్రవరి 5న మొదలవ్వాల్సిన అనిల్ రావిపూడి NBK 108 కొత్త షెడ్యూల్ ఇప్పటి వరకు ఇంకా మొదలు కాలేదు. అబ్బాయి మరణంతో కుంగిపోయిన నందమూరి కుటుంబానికి పెద్దదిక్కుగా మారిపోయాడు బాలకృష్ణ. మరీ ముఖ్యంగా తారక రత్న భార్య అలేఖ్య రెడ్డికి అన్ని విధాలా ధైర్యం చెబుతూ ఆ పిల్లల బాధ్యతను కూడా తీసుకున్నాడు నందమూరి నటసింహం.

తాజాగా మార్చి 2న తారకరత్న పెద్దకర్మ కూడా పూర్తి కావడంతో మెల్లగా తన సినిమాపై ఫోకస్ చేశాడు బాలయ్య. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమాలో తారకరత్న కూడా నటించేవాడు. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ తారకరత్న కోసం రాయాలి అంటూ స్వయంగా బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడిని అడిగాడు. అందుకే గడ్డం పెంచి లుక్కు కూడా మార్చేశాడు తారక్. కానీ అంతలోనే ఆయన గుండెపోటుతో హఠాత్మరణం చెందడంతో నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇవన్నీ పక్కన పెడితే మార్చ్ 6 నుంచి బాలకృష్ణ.. అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజానికి బాలయ్య రాకపోయినా మార్చి 4 నుంచే షూటింగ్ మొదలు పెడుతున్నాడు అనిల్ రావిపూడి. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజా షెడ్యూల్లో ఈమె కూడా జాయిన్ అయింది.

ఇక ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు బాలయ్య. ఇందులో మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నాడు. 30ల్లో ఉన్నప్పుడు హాయిగా కుటుంబంతో పాటు ఉండే ఒక వ్యక్తి అనుకోకుండా ఒక హత్య కేసులో 14 ఏళ్ల పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. తిరిగి మధ్య వయసులో ఉన్నప్పుడు మళ్ళీ జైలు నుంచి విడుదలైన ఆయనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. అక్కడి నుంచి తన జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది అనే లైన్ తో NBK 108 సినిమా వస్తుందని తెలుస్తోంది.

ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీలా నటిస్తుండగా.. హీరోయిన్ గా కాజల్ మొదటిసారి బాలయ్య సరసన కనిపిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ ఈసారి దసరాకు ప్రభాస్ సలార్.. విజయ్ లియో.. పవన్ కళ్యాణ్ OG లాంటి సినిమాలు క్యూలో ఉన్నాయి. వీటితో పాటే బరిలోకి దిగబోతున్నాడు బాలయ్య.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Balagam Movie | బలగం.. మట్టి వాసనంత అచ్చమైన పల్లెటూరి సినిమా..

Lavanya Tripathi | అలాంటివి ఇష్టమే ఉండదు.. పెళ్లి వార్తలపై స్పందించిన లావణ్య త్రిపాఠి

Manchu Manoj | సైలెంట్‌గా మంచు మనోజ్‌, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్‌

Saif Ali Khan | మీడియాపై సైఫ్‌ అలీ ఖాన్ అసహనం‌.. ఇంకెందుకు లేటు.. మా బెడ్ రూమ్‌లోకి రండి అంటూ ఆగ్రహం!

Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Exit mobile version