Home Entertainment Lavanya Tripathi | అలాంటివి ఇష్టమే ఉండదు.. పెళ్లి వార్తలపై స్పందించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi | అలాంటివి ఇష్టమే ఉండదు.. పెళ్లి వార్తలపై స్పందించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi | పదేళ్ల క్రితం ‘అందాల రాక్షసి’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే అటు యూత్‌ను ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులను తన బుట్టలో పడేసుకుంది. ఈ సినిమాతో లావణ్య రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోతుందని అందరూ భావించారు.

కట్‌ చేస్తే మూడేళ్ల వరకు మరో హిట్టు లేదు. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు తలుపు తట్టినా.. ఈ అమ్మడుకి స్టార్‌ హీరోలతో నటించే చాన్స్‌ రాలేదు. ఇక గతేడాది ‘హ్యాపీ బర్త్‌డే’ అంటూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈమె నటించిన పులిమేక వెబ్‌సిరీస్‌ జీ-5లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

ఇదిలా ఉంటే గతకొంత కాలంగా లావణ్య పెళ్లి వార్తల గురించి సోషల్‌ మీడియాలో వార్తలు తెగ పుట్టుకొస్తున్నాయి.తాజాగా వీటిపై లావణ్య స్పందించింది. తను చాలా అదృష్టవంతురాలని, తన పేరెంట్స్‌ పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం లేదని చెప్పింది. తనలా వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లు కెరీర్‌ పైనే దృష్టిపెడతారని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమా షూటింగ్‌ల పైనే ఉందని వెల్లడించింది. సమయం వచ్చినప్పుడు పెళ్లి అదే జరుగుతుందని, వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పడం ఇష్టం లేదని తాజాగా పులిమేక ప్రమోషన్‌లలో చెప్పుకొచ్చింది.

దీంతో లావణ్య పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్‌ పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘థనల్‌’ అనే తమిళ సినిమాతో పాటు తెలుగులోనూ ఒక సినిమాకు సైన్‌ చేసింది. ఇక పులిమేక వెబ్‌సరీస్‌తో తొలిసారిగా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టింది. కోన వెంకట్‌ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు చక్రవర్తి రెడ్డి దర్శకత్వ వహించాడు. ఆది సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌లో సుమన్‌, రాజా, సిరీ హన్మంత్‌ కీలకపాత్రల్లో నటించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Manchu Manoj | సైలెంట్‌గా మంచు మనోజ్‌, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్‌

Saif Ali Khan | మీడియాపై సైఫ్‌ అలీ ఖాన్ అసహనం‌.. ఇంకెందుకు లేటు.. మా బెడ్ రూమ్‌లోకి రండి అంటూ ఆగ్రహం!

Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

Exit mobile version