Home Entertainment Jabardasth | జబర్దస్త్ కలిపింది వాళ్లిద్దరినీ.. పెళ్లితో ఒక్కటైన రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత

Jabardasth | జబర్దస్త్ కలిపింది వాళ్లిద్దరినీ.. పెళ్లితో ఒక్కటైన రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత

Jabardasth | మొత్తానికి రాకింగ్ రాకేశ్ ( Rocking Rakesh ), జోర్దార్ సుజాత ( Jordar Sujatha ) ఒక్కటయ్యారు. జబర్దస్త్ స్టేజి మీద పుట్టిన తమ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో శుక్రవారం ఉదయం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ మంత్రి రోజా సెల్వమణి దంపతులు, గెటప్ శీనుతో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్లు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

దాదాపు 20 ఏళ్ల క్రితం మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన రాకేశ్‌కు జబర్దస్త్ కామెడీ షో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. జబర్దస్త్‌లో వచ్చిన ఫేమ్‌తో రాకింగ్ రాకేశ్ పలు ఈవెంట్లు కూడా చేస్తూ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. ఇదిలా ఉంటే మారుమూల పల్లె నుంచి వచ్చిన సుజాతకు ప్రముఖ న్యూస్ ఛానల్‌లో జోర్దార్ వార్తలుతో ఫేమస్ అయ్యింది. అందులో వచ్చిన గుర్తింపుతో బిగ్‌బాస్‌ షోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అందులో నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజుల తర్వాత జబర్దస్త్ స్టేజి మీద మెరిసింది.

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో రాకింగ్ రాకేశ్ టీమ్‌లో కొంతకాలంగా జోర్దార్ సుజాత స్కిట్స్ చేస్తూ కనిపిస్తుంది. ఈ టీవీ షోలోనే అందరి ముందు సుజాతకు రాకేశ్ ప్రపోజ్ చేశాడు. కానీ ఇలాంటి లవ్ ప్రపోజల్స్‌ను, లవ్ కపుల్స్‌ను చూసిన జబర్దస్త్ ఆడియన్స్.. ఇదంతా మల్లెమాల ప్రొడక్షన్స్ ట్రిక్ అని అనుకున్నారు. సుడిగాలి సుధీర్ – రష్మి గౌతమ్, ఇమ్మాన్యుయెల్ – వర్ష తరహాలో హైప్ కోసం మరో జంటను రెడీ చేస్తుందని అనుకున్నారు. కానీ తమది రీల్ జోడీ కాదు.. రియల్ జోడీ ముందు నుంచి రాకేశ్, సుజాత చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని తమది జబర్దస్త్ కలిపిన బంధం అని చాటిచెబుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitte

Medical Student Preethi | వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ.. తప్పు ఎవరిదంటే..

Heart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన మరో వ్యక్తి

RGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని కేటీఆర్‌కు రిక్వెస్ట్‌

Viral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..



Exit mobile version