Home Entertainment Rao Ramesh | హీరో అవతారమెత్తిన రావు రమేశ్.. హీరోయిన్‌గా అందాల తార!

Rao Ramesh | హీరో అవతారమెత్తిన రావు రమేశ్.. హీరోయిన్‌గా అందాల తార!

Rao Ramesh | ఇప్పటిదాకా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దుమ్మురేపిన రావు రమేశ్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తుతున్నాడు. హీరోగా కూడా అదరగొట్టేందుకు సిద్ధమయ్యాడు. రావు రమేశ్ ప్రధాన పాత్రలో ఇప్పుడు ఒక సినిమా తెరకెక్కుతుంది. ఇప్పుడు ఈ వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

రావు రమేశ్ హీరోగా వస్తున్న సినిమా పేరు మారుతినగర్ సుబ్రహ్మణ్యం ( Maruti Nagar Subramanyam ). పీబీఆర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా ఈ సినిమా వస్తుంది. హ్యాపీ వెడ్డింగ్ సినిమా ఫేమ్ లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరని ఆలోచిస్తున్నారా? అది ఎవరో కాదు అందాల తార ఇంద్రజ ( Indraja ). సినిమాల నుంచి చాలా రోజుల గ్యాప్ తర్వాత జబర్దస్త్ కామెడీ షోకి వచ్చిన ఇంద్రజ.. రోజా వెళ్లిపోయిన తర్వాత ఆ ప్లేస్‌లో సెటిలైపోయింది. తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు ఫేవరేట్‌గా మారింది. ఇలాంటి సమయంలో రావు రమేశ్, ఇంద్రజ కాంబినేషన్‌లో సినిమా రావడం వైరల్‌గా మారింది.

మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాను దర్శకుడు లక్ష్మణ్ కార్య తాజాగా ప్రకటించారు. వినోదాత్మకంగా వస్తున్న ఈ చిత్రం ఆద్యాంతం క్షణ క్షణం ట్విస్టులతో ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని ఈ సందర్భంగా డైరెక్టర్ తెలిపాడు. నడి వయసులో ఉన్న ఓ మధ్యతరగతి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వి్స్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పాడు.

Follow Us :  Google News, FacebookTwitte

Medical Student Preethi | వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ.. తప్పు ఎవరిదంటే..

Heart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన మరో వ్యక్తి

RGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని కేటీఆర్‌కు రిక్వెస్ట్‌

Viral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..

Exit mobile version