Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentPrabhas | 21 కోట్లు అప్పు తీసుకున్న ప్రభాస్.. కారణం అదేనా?

Prabhas | 21 కోట్లు అప్పు తీసుకున్న ప్రభాస్.. కారణం అదేనా?

Prabhas | బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అప్పట్నుంచి రెబల్ స్టార్ నటించిన సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టే రెమ్యునరేషన్ కూడా కోట్లలో అందుకున్నాడు. అంతటి స్టార్‌డమ్ కలిగిన ప్రభాస్.. పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడనే విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

హైదరాబాద్‌లోని ఓ బ్యాంకు నుంచి ప్రభాస్ సుమారు 21 కోట్ల రూపాయల వరకు అప్పుగా తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని తనకు ఉన్న ప్రాపర్టీని తనఖా పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి అంతా షాకవుతున్నారు. మొదట్నుంచి రాజుల కుటుంబం.. పైగా సినిమాల నుంచి కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అలాంటప్పుడు ప్రాపర్టీ తనఖా పెట్టి లోన్ తీసుకోవాల్సిన అవసరం ప్రభాస్‌కు ఏమొచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. అయితే డబ్బులు అవసరమై కాదు.. ప్రాపర్టీ కబ్జా కాకుండా ఉండేందుకు ప్రభాస్ ఇలా తనఖా పెట్టి ఉంటాడని కొందరు వివరిస్తున్నారు. మరి ప్రభాస్ నిజంగానే లోన్ తీసుకున్నాడా? లేదా ఇవన్నీ పుకార్లేనా అన్న విషయం తేలాల్సి ఉంది.

పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో నటించిన ఆదిపురుష్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్ట్ కే చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. సందీప్ వంగాతో స్పిరిట్ అనే భారీ చిత్రాన్ని కూడా ప్లాన్ చేశాడు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదలవుతున్నాయి. ఇన్ని భారీ చిత్రాల మధ్య చిన్న గ్యాప్ తీసుకుని డైరెక్టర్ మారుతితో ఒక తెలుగు సినిమా చేస్తున్నాడు ప్రభాస్. హారర్ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం స్టోరీ మొత్తం ఓ థియేటర్ చుట్టూ తిరుగుతుంది. దీనికి రాజా డీలక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 17న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ మొదలైంది. దీనికి సంబంధించిన ప్రభాస్ లుక్ కూడా ఈమధ్య లీకయ్యి వైరల్‌గా మారింది. వింటేజ్ లుక్‌లో ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Prabhas in Raja Deluxe | వింటేజ్ లుక్‌లో కేక పుట్టిస్తున్న ప్రభాస్.. రాజా డీలక్స్ నుంచి లీకైన పిక్స్

Sushant singh rajput | సుశాంత్‌ సింగ్‌ది హత్యనే.. పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

Krithi shetty | ఇంత చిన్న రీజన్‌కే బాలీవుడ్ ఆఫర్‌ వదిలేసుకున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి

Tollywood 2022 | కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సహా 2022లో మరణించిన సెలబ్రెటీలు వీళ్లే.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News