Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentKrithi shetty | ఇంత చిన్న రీజన్‌కే బాలీవుడ్ ఆఫర్‌ వదిలేసుకున్న ఉప్పెన బ్యూటీ కృతి...

Krithi shetty | ఇంత చిన్న రీజన్‌కే బాలీవుడ్ ఆఫర్‌ వదిలేసుకున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి

Krithi shetty | తొలి సినిమాతోనే టాలీవుడ్‌కు ఉప్పెనలా దూసుకొచ్చింది కృతిశెట్టి. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల ఫేవరేట్‌ హీరోయిన్‌ అయిపోయింది. దీంతో ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. వచ్చిన అవకాశాలను వచ్చినట్టు యూజ్‌ చేసుకుంటూ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను చేసింది. కానీ అవేవీ ఆమె కెరీర్‌కు ప్లస్‌ కాలేదు. ఒక్క బంగార్రాజు సినిమా తప్ప ఈ ఏడాది కృతిశెట్టి చేసిన సినిమాలన్నీ డిజాస్టర్‌గా మిగిలిపోయాయి. దీంతో కృతి శెట్టి ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంది.

వరుస ఫ్లాపులు ఎదురైనా సరే యూత్‌లో కృతి శెట్టి క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. కుర్రాళ్లలో పాపులారిటీ ఉన్నా సరే సినిమాలు హిట్‌ కాకపోతే కష్టమని భావించిన కృతి.. ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది. ఏదైనా ఒక సినిమా ఒప్పుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. వెంటవెంటనే ఏ సినిమాకు కమిట్‌ అవ్వట్లేదు. అందుకే ఇప్పుడు కృతి శెట్టి చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు. మలయాళంలో ఒక సినిమా మాత్రమే ఉంది. ఈ మధ్యనే కోలీవుడ్‌లో ఒక సినిమాకు ఓకే చెప్పింది. సూర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కృతికి బాలీవుడ్‌ నుంచి కూడా పిలుపు వచ్చింది. కానీ ఆ ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్‌లో అందాదూన్‌ చిత్రాన్ని తీసిన దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ మరో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. దీనికోసం హీరోయిన్‌గా కృతి శెట్టి అయితే బాగుంటుందని అనుకున్నాడట. ఇదే విషయమై కృతిశెట్టికి చెబితే ఓకే కూడా చెప్పేసింది. అయితే షూటింగ్‌ స్టార్ట్ చేసేముందు ముంబైకి వచ్చి ఆడిషన్‌ ఇస్తే బాగుంటుందని చిత్ర బృందం కృతి శెట్టిని కోరడంతో కొద్దిగా డిసప్పాయింట్‌ అయ్యిందట. కొత్త హీరోయిన్‌లా ఆడిషన్‌ ఇవ్వడమేంటని భావించిన కృతి శెట్టి ఆ ఆఫర్‌ను వదిలేసుకుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ గాసిప్‌లో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

Prabhas in Raja Deluxe | వింటేజ్ లుక్‌లో కేక పుట్టిస్తున్న ప్రభాస్.. రాజా డీలక్స్ నుంచి లీకైన పిక్స్

Tollywood 2022 | కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సహా 2022లో మరణించిన సెలబ్రెటీలు వీళ్లే.

kalpika ganesh | వాళ్లందరి బండారం బయటపెడతా.. కల్పిక గణేశ్ వార్నింగ్

Disaster movies of 2022 | ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యంత డిజాస్టర్‌ అయిన మూవీస్‌ ఇవే..

Sneha divorce | సినీ నటి స్నేహ విడాకుల రూమర్స్‌.. ఆ ఒక్క ఫొటో చెక్‌ పెట్టినట్లేనా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News