Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsCristiano Ronaldo | రొనాల్డోకు రోల్స్ రాయల్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రియసి.. కారణం ఏంటంటే..

Cristiano Ronaldo | రొనాల్డోకు రోల్స్ రాయల్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రియసి.. కారణం ఏంటంటే..

Cristiano Ronaldo | పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఈ క్రిస్మస్‌కు అదిరిపోయే కానుక అందుకున్నాడు. దాదాపు 2.4 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ లగ్జరీ కారును క్రిస్మస్ కానుకగా పొందాడు. ఇంతకీ అంత ఖరీదైన గిఫ్ట్ రొనాల్డోకు ఎవరు ఇచ్చారని అనుకుంటున్నారా? ఇంకెవరూ అతని ప్రేయసి జార్జినా రోడ్రిగ్ ( Georgina Rodriguez ). రొనాల్డోకు కారును బహుమతిగా ఇవ్వడంతో పాటు ఆ అద్భుతమైన క్షణాలను వీడియో తీసుకుంది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. క్రిస్మస్ రాత్రి మ్యాజిక్.. థ్యాంక్యూ శాంటా అంటూ స్పానిష్‌లో రాసుకొచ్చింది. కొత్త కారుతో దిగిన ఫొటోలను రొనాల్డో కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు. థ్యాంక్యూ మై లవ్ అని కామెంట్ పెట్టాడు.

జార్జినా రోడ్రిగ్ స్పెయిన్‌కు చెందిన మోడల్. గూచీ కంపెనీ కోసం పనిచేస్తున్న సమయంలో జార్జినా, రొనాల్డోకు మధ్య పరిచయం ఏర్పడింది. 2017 నుంచి వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే తన కెరీర్‌లో చివరగా ఆడిన ఫిఫా వరల్డ్ కప్‌లో అతనికి నిరాశే ఎదురైంది. కష్టపడి క్వార్టర్ ఫైనల్స్‌ వరకు తీసుకెళ్తే కీలక మ్యాచ్‌లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేశారు. సెకండ్ సబ్‌స్టిట్యూట్‌గా రంగంలోకి దిగిన రొనాల్డో జట్టును గెలిపించేందుకు చాలా కష్టపడ్డాడు. కానీ అప్పటికే లీడ్‌లో ఉండటంతో మొరాకోనే విజయం సాధించింది. ఫిఫా వరల్డ్ కప్ గెలవాలన్న కల చెదిరిపోవడంతో.. రొనాల్డో గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది అప్పట్లో వైరల్‌గా మారింది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News