Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLatest NewsPragya singh Thakur | హిందువులు స్వీయరక్షణ కోసం పదునైన ఆయుధాలను ఇళ్లలో పెట్టుకోండి.. బీజేపీ...

Pragya singh Thakur | హిందువులు స్వీయరక్షణ కోసం పదునైన ఆయుధాలను ఇళ్లలో పెట్టుకోండి.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Pragya singh Thakur | హిందూ సమాజం తమను తాము రక్షించుకునేందుకు ఇళ్లల్లో పదునైన ఆయుధాలు పెట్టుకోవాలంటూ బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలు లేకుంటే కనీసం కూరగాయలు కోసే కత్తులను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన హిందూ జాగరణ వేదిక సౌత్‌ రీజియన్‌ వార్షిక సదస్సులో పాల్గొన్న ప్రగ్యా సింగ్‌.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమపైనా, తమ ఆత్మ గౌరవంపైన దాడులు చేసే వారికి దీటుగా జవాబిచ్చే హక్కు హిందువులకు ఉందన్నారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ పార్లమెంటరీ నియోజవర్గానికి ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ బీజేపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రగ్యా మాట్లాడుతూ.. ” లవ్‌ జీహాద్‌లో జీహాద్‌ సంప్రదాయం ఉంది. వాళ్లు ప్రేమిస్తే అందులోనూ జీహాద్‌ను చూస్తారు. మనమూ ప్రేమిస్తాం కానీ దేవుడినే. ఒక సన్యాసి కూడా ప్రేమిస్తాడు. దేవుడు ఈ జగత్తును సృష్టించాడని సన్యాసి చెబుతాడు. అణచివేతలన్నింటినీ పాపంగా చెబుతాడు. ప్రేమకు నిజమైన నిర్వచనం ఇవ్వలేకపోతే ఇక్కడ ఎవరూ బతకలేరు. లవ్‌ జీహాద్‌కు పాల్పడుతున్న వారికి కూడా అదే స్థాయిలో మనం జవాబివ్వాలి. మీ అమ్మాయిలను రక్షించండి. వారికి సరైన విలువలు నేర్పండి” అన్నారు.

అజ్ఞాత వ్యక్తులు ఇళ్లలోకి చొరబడితే ఊరుకోవాలా ?

కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన హర్ష సహా పలువురు హిందూ కార్యకర్తలు హత్యకు గురికావడాన్ని ప్రగ్యా గుర్తు చేశారు. ఈ సందర్భంగా స్వీయ రక్షణ కోసం ప్రజలు ఇళ్లల్లో పదునైన ఆయుధాలు పెట్టుకోవాలన్నారు. ఆయుధాలు లేకుంటే కనీసం కూరగాయలు తరిగే కత్తులనైనా అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఎవరికీ తెలియదన్న ఆమె.. ప్రతి ఒక్కరికీ స్వీయరక్షణ హక్కు ఉంటుందన్నారు. ఎవరో అజ్ఞాత వ్యక్తులు మన ఇళ్లలోకి చొరబడి దాడి చేస్తే వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పడం మన హక్కు అంటూ ప్రగ్యా వ్యాఖ్యానించారు.

పిల్లలకు ధర్మం, శాస్త్రం ఏం చెప్పిందో బోధించండి

ప్రస్తుతం తల్లిదండ్రులందరూ మిషనరీ విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివించేందుకు తహతహలాడుతున్నారని, దీనివల్ల వృద్ధాశ్రమాలకు మీరే తలుపులు తెరిచినట్లు అవుతుందన్నారు. ఇళ్లల్లో పూజలు చేసుకోవాలని, ధర్మం, శాస్త్రం ఏం చెప్పిందో చదవాలని, వాటిని పిల్లలకు బోధించాలని ప్రగ్యా పిలుపునిచ్చారు. అప్పుడే పిల్లలు మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను తెలుసుకోగలుగుతారని చెప్పుకొచ్చారు

Follow Us : FacebookTwitter

Read More Articles |

CESS Elections | సెస్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ విజయం.. ప్రజాస్వామ్యాన్ని బీఆర్‌ఎస్‌ అపహాస్యం చేస్తోందన్న బండి సంజయ్‌

AP Intermediate exam schedule | ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ షెడ్యూల్‌ విడుదల.. మార్చి 15 నుంచి పరీక్షలు

Srisailam | శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Bruce Lee Death Mystery | బ్రూస్‌లీ మరణానికి అసలు కారణమేంటి? అతిగా నీళ్లు తాగడం వల్లే చనిపోయాడా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News