Home Entertainment Rajamouli | ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసిన అవతార్ సృష్టికర్త జేమ్స్ కామెరూన్.. ఆనందాన్ని పంచుకున్న రాజమౌళి

Rajamouli | ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసిన అవతార్ సృష్టికర్త జేమ్స్ కామెరూన్.. ఆనందాన్ని పంచుకున్న రాజమౌళి

Rajamouli | టైటానిక్, అవతార్ వంటి విజువల్ వండర్స్ తెరకెక్కించిన హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మన ఇండియన్ సినిమాను చూశాడు. అదీ కూడా మన తెలుగు సినిమా.. ఆర్‌ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ చిత్రాన్ని జేమ్స్ కామెరూన్ ఒక్కసారి కాదు.. రెండు సార్లు చూశాడు. మొదటి సారి చూడగానే సినిమా నచ్చడంతో రెండోసారి తన భార్య సుజీతో మరోసారి సినిమాను చూశాడు. అంతేకాదు ఈ సినిమా గురించి దర్శకధీరుడిని కలిసి దాదాపు 10 నిమిషాల పాటు ఆర్‌ఆర్ఆర్ చిత్రంపై విశ్లేషించాడు. ఈ విషయాన్ని జక్కన్ననే సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దిగ్గజ దర్శకుడు తన సినిమాను మెచ్చుకోవడంపై ఆనందంతో మురిసిపోయాడు.

ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆర్‌ఆర్ఆర్ సినిమాను చూశాడు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. అందుకే తన భార్య సుజీతో కలిసి రెండోసారి కూడా చూశాడు. అని రాజమౌళి ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా సినిమాను చూడటమే కాకుండా దాదాపు 10 నిమిషాలు మాతో గడిపి సినిమాను విశ్లేషించారంటే నమ్మలేకపోతున్నా అంటూ జేమ్స్ కామెరూన్ గురించి రాసుకొచ్చాడు. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తాజాగా జేమ్స్ కామెరూన్ కలిసిన ఫొటోలను షేర్ చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. అంతర్జాతీయ సినిమా అవార్డులు సైతం ఆర్ఆర్ఆర్‌కు దాసోహం చేస్తున్నాయి. ఇటీవల నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఈ చిత్రం తాజాగా క్రిటిక్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nitiin & Rashmika Mandanna | మరోసారి జోడీ కట్టబోతున్న నితిన్, రష్మిక.. భీష్మ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Shweta basu prasad | కొత్త బంగారు లోకం హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది?

Rajamouli | ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్.. బాలీవుడ్ హీరోపై చేసిన కామెంట్స్‌పై రాజమౌళి వివరణ

Chiranjeevi | మాది సినిమా కులం.. సినీ కార్మికులను తలచుకుని మరోసారి ఎమోషనల్ అయిన చిరంజీవి

Kushboo | జయసుధ కోసం వారసుడు సినిమా నుంచి కుష్బూను తప్పించారా?

Jayasudha | అమెరికన్ బిజినెస్‌మ్యాన్‌తో జయసుధ మూడో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సహజనటి

Exit mobile version