Home Entertainment Jayasudha | అమెరికన్ బిజినెస్‌మ్యాన్‌తో జయసుధ మూడో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సహజనటి

Jayasudha | అమెరికన్ బిజినెస్‌మ్యాన్‌తో జయసుధ మూడో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సహజనటి

Jayasudha | సహజ నటి జయసుధ చాలా రోజుల తర్వాత వారసుడు ( వారిసు ) సినిమాతో వెండితెరపై కనిపించింది. 2019లో బాలకృష్ణ హీరోగా వచ్చిన రూలర్ సినిమాలో కనిపించిన ఆమె.. తర్వాత అమెరికా వెళ్లిపోయింది. ఇంతకాలం అక్కడే ఉంది. తాజాగా ఇండియా వచ్చిన ఆమె దిల్ రాజు నిర్మించిన వారిసు సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కూడా జయసుధ సందడి చేసింది. ఆ సమయంలో ఆమె పక్కన ఉన్న ఓ వ్యక్తి అందరి కళ్లలో పడ్డాడు. జయసుధ ఎక్కడికి వెళ్లినా అతను అక్కడ కనిపించడంతో కొన్ని వదంతులు పుట్టుకొచ్చాయి. జయసుధ అమెరికాలో అతన్ని మూడో పెళ్లి చేసుకుందనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలు వైరల్ కావడంతో జయసుధ స్పందించింది.

అమెరికా వెళ్లిన తర్వాత అక్కడి బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నారా? అని జయసుధను ఓ మీడియా అడగ్గా.. వాటిని ఖండించింది. తనతో ఉన్న వ్యక్తి ఫెలిపే ( Felipe Ruelas ) అని.. తనకు స్నేహితుడని.. ఒక సినిమా కొలబరేషన్‌కి కలిశామని చెప్పింది. అమెరికా నుంచి వచ్చాడని పేర్కొంది. తన బయోపిక్ తీసేందుకు అన్నీ దగ్గరుండి గమనిస్తున్నాడని స్పష్టం చేసింది. స్పిరిట్యుయల్ బయోపిక్‌గా అది తెరకెక్కనున్నట్టు చెప్పింది. ఇందులో తను క్రిస్టియానిటీలోకి ఎందుకు మారాల్సి వచ్చింది? అంతకుముందు తన జీవితం ఎలా ఉండేది? తర్వాత ఎలా మారింది? అన్న విషయాలు అందులో ఉంటాయని పేర్కొంది.

ఫెలిపే తనతో తిరగకుండా రీసెర్చ్ చేసి.. ఇంటర్నెట్‌, సోషల్‌మీడియాలో తెలుసుకుని బయోపిక్ తీయొచ్చు.. కానీ ఇక్కడ తనకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంది.. తనను ఎవరు ఎలా గౌరవిస్తారనేది తెలియదు కదా.. అందుకే తనతో పాటు ఉండి రీసెర్చ్ చేస్తున్నాడని జయసుధ స్పష్టం చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Veerasimhareddy first day collections | తొలిరోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు

Shruti Haasan | నా జ్వరం కాస్త మానసిక సమస్యగా మారిందన్నమాట.. అనారోగ్య వార్తలపై స్పందించిన శ్రుతిహాసన్‌.

Saipallavi | సాయిపల్లవికి ఏమైంది.. ఛాన్సులు రావడం లేదా? తనే ఒప్పుకోవడం లేదా?

Waltair Veerayya | వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీకి వచ్చేది అప్పుడే..

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Exit mobile version