Home Entertainment Rajamouli | ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్.. బాలీవుడ్ హీరోపై చేసిన కామెంట్స్‌పై రాజమౌళి వివరణ

Rajamouli | ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్.. బాలీవుడ్ హీరోపై చేసిన కామెంట్స్‌పై రాజమౌళి వివరణ

Rajamouli | దర్శకధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా వినబడుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో పాటు ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలవడంతో అంతా ఈయన గురించే మాట్లాడుతున్నారు. భారతీయులు, విదేశీయులు అంతా రాజమౌళిని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌పై రాజమౌళి గతంలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ప్రభాస్ బిల్లా సినిమాలో నటించిన రోజులవి. ఆ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అప్పుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘ ధూమ్ 2 సినిమాలో హృతిక్ రోషన్‌ను చూసి ఆశ్చర్యపోయాను. కానీ ఇప్పుడు బిల్లా సినిమా ట్రైలర్ చూశాక అర్థమైంది. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్’ అంటూ కామెంట్ చేశాడు. అప్పుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలను అంతా మరిచిపోయారు. కానీ రీసెంట్‌గా రాజమౌళికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిన ఈ టైమ్‌లో మళ్లీ ఆ వీడియో తెరమీదకు వచ్చింది. సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. దీంతో అప్పుడు హృతిక్ రోషన్‌పై చేసిన వ్యాఖ్యలపై దర్శకధీరుడు తాజాగా వివరణ ఇచ్చాడు.

దాదాపు 15 ఏళ్ల కిందటి వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో తెలియదంటూ రాజమౌళి తెలిపాడు. కానీ నేను ఈ విషయాన్ని అంగీకరిస్తున్నానని చెప్పాడు. ఆ వీడియోలో తను మాట్లాడిన పదాల ఎంపిక బాగోలేదని తన తప్పు ఒప్పుకున్నాడు. హృతిక్‌ను కించపరచడం తన ఉద్దేశం కాదని.. అతన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. రాజమౌళి ఇచ్చిన వివరణతో నెటిజన్లు ఆయన్ను ప్రశంసిస్తున్నారు. తప్పును అంగీకరించడం మీ గొప్పదనం అంటూ మెచ్చుకుంటున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kushboo | జయసుధ కోసం వారసుడు సినిమా నుంచి కుష్బూను తప్పించారా?

Jayasudha | అమెరికన్ బిజినెస్‌మ్యాన్‌తో జయసుధ మూడో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సహజనటి

Veerasimhareddy first day collections | తొలిరోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

Exit mobile version