Dil Raju Marriage | టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు ఎప్పుడు మీడియా ముందుకొచ్చిన సినిమాల గురించే మాట్లాడతాడు. పర్సనల్ విషయాల గురించి చాలా తక్కువగా ప్రస్తావిస్తాడు. కానీ ఈసారి ఓపెన్ అయిపోయాడు. వారసుడు ( వారిసు ) మూవీ సక్సెస్ కావడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు.. తన పర్సనల్ విషయాలను చెప్పుకొచ్చాడు. మొదటి భార్య అనిత మరణం తర్వాత మూడేళ్ల పాటు ఒంటరిగా ఉన్న తను రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? వైఘా రెడ్డి ( తేజస్విని ) తనకు ఎలా పరిచయమైంది? ఆమెకు ప్రపోజ్ ఎలా చేశాడు వంటి విషయాలను దిల్ రాజు బయటపెట్టాడు.
మొదటి భార్య అనిత అంటే దిల్ రాజుకు ఎంతో ప్రేమ. తను నిర్మించిన ప్రతి సినిమాకు ముందు శ్రీమతి అనిత సమర్పించు అని రావడం చూస్తూనే ఉంటాం. అంతలా ప్రేమించిన అనిత మరణంతో రెండేళ్ల పాటు చాలా స్ట్రగులయ్యాడు. అప్పటికీ 47 ఏళ్లకు ఉన్నాడు. ఇలాంటి టైమ్‌లో మూవ్ ఆన్ అవ్వాలంటే రెండు మూడు ఆప్షన్స్ కనిపించాయి. కానీ సెలబ్రెటీ కావడంతో తనను అర్థం చేసుకునే అమ్మాయి వస్తే బాగుంటుందని లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నాడు. అలాంటి సమయంలోనే ఫ్లైట్‌లో వైఘా రెడ్డి పరిచయం అయ్యింది. ఆమె ఎయిర్‌లైన్స్‌లో పనిచేసేది. అలా తరచూ విమానాల్లో కలుసుకోవడంతో ఒకసారి వైఘా రెడ్డి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. కాల్స్ మాట్లాడుతూ.. చాట్ చేస్తూ పరిచయం పెంచుకున్నాడు.

ఇలా ఏడాదికి పైగా ట్రావెల్ చేసిన తర్వాత ప్రపోజ్ చేయడం, ఆ తర్వాత ఫ్యామిలీతో చర్చలు, చివరకు పెళ్లి వరకు వెళ్లిందని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. వైఘా రెడ్డితో గ్రౌండ్ టు ఎర్త్ ఆటిట్యూడ్ అంటే ఇష్టమని దిల్ రాజు తెలిపాడు. వైఘా రెడ్డికి తను ఎవరో ముందు తెలియదని దిల్ రాజు చెప్పాడు. ముందు తనను డైరెక్టర్ అనుకుందని.. తనను నిర్మాతను అని పరిచయం చేసుకుంటే గూగుల్ చేసి వెతికి తెలుసుకుందని పేర్కొన్నాడు. ఇక దిల్ రాజుతో పరిచయం గురించి వైఘా రెడ్డి కూడా ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తను ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నప్పుడు దిల్ రాజు పరిచయం అయ్యాడని తెలిపింది. తను షిఫ్ట్‌లో ఉన్న ప్రతిసారి విమానంలో దిల్ రాజు కనిపించేవాడని చెప్పింది. మొదటిసారి కలిసినప్పుడు పెన్ అడిగాడని.. అలా తమ మధ్య పరిచయం ఏర్పడిందని గుర్తు చేసుకుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి
vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో
Mamta Mohandas | మమతా మోహన్‌దాస్ అప్పుడు క్యాన్సర్ నుంచి కోలుకుంది.. ఇప్పుడు మరో వ్యాధి బారిన పడింది
Shweta basu prasad | కొత్త బంగారు లోకం హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది?