Tuesday, June 18, 2024
- Advertisment -
HomeEntertainmentTop 10 south Indian actress | ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికింది ఈ...

Top 10 south Indian actress | ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికింది ఈ హీరోయిన్‌ గురించే..

Top 10 south Indian actress | హీరోయిన్లు అంటే సినీ అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్‌ ఉంటుంది. తమ అభిమాన తార ఎలాంటి అప్‌డేట్స్‌ పెట్టిందనే విషయంలో తరచూ గూగుల్‌లో సెర్చ్‌ చేసే వాళ్లు చాలామందే ఉంటారు. అలా సౌత్‌ ఇండియాలో ఏ హీరోయిన్‌ గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికారో తెలుసుకోవాలని ఉందా.. 2022లో అత్యధికంగా ఏ హీరోయిన్ల గురించి వెతికారనే జాబితాను తాజాగా గూగుల్‌ ప్రకటించింది. ఈ జాబితాలో గత ఏడాది మాదిరిగానే కాజల్ టాప్‌ పొజిషన్‌లో నిలిచింది. మరి ఈ జాబితాలో ఉన్న టాప్‌ 10 హీరోయిన్లు ఎవరో చూద్దాం..

కాజల్‌

పెళ్లి చేసుకుని తల్లయిన కూడా కాజల్ అగర్వాల్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది సినిమాలు ఏమీ చేయకపోయినప్పటికీ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం.. ఆ వెంటనే కమ్‌ బ్యాక్‌ ఇచ్చేందుకు రెడీ అవ్వడంతో కాజల్‌ గురించి ఫ్యాన్స్‌ ఎక్కువగా వెతికారు. దీంతో ఈ ఏడాది కూడా గూగుల్‌లో అత్యధికంగా వెతికిన హీరోయిన్ల జాబితాలో కాజల్‌ అగర్వాల్‌నే టాప్‌ పొజిషన్‌లో నిలిచింది.

సమంత

నాగచైతన్యతో విడిపోవడం, మయోసైటిస్‌ బారిన పడటం, అనారోగ్యం కారణంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లిందనే పుకార్లు తదితర అంశాల కారణంగా సమంత గురించి ఫ్యాన్స్‌ తరచూ గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. ఈ కారణంతో సమంత రెండో పొజిషన్‌లో నిలిచింది.

రష్మిక

రష్మిక మంధన మూడో పొజిషన్‌లో ఉండటానికి ప్రత్యేకంగా కారణాలేవీ లేవు. గత ఏడాది క్రిస్మస్‌ కానుకగా విడుదలైన పుష్ప సినిమాతో రష్మిక నేషనల్‌ క్రష్‌గా మారింది. దీంతో ఆమె గురించి సౌత్‌తో పాటు బాలీవుడ్‌ ఆడియన్స్‌ ఎక్కువగా వెతికారు. పైగా రష్మిక ఎప్పటికప్పుడు తన ఫొటోలు షేర్‌ చేస్తూ నిత్యం ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. వీటివల్ల గూగుల్‌లో టాప్‌ 3 పొజిషన్‌కు వచ్చింది. పైగా కాంతార సినిమా తర్వాత రష్మికపై ట్రోల్స్‌ జరగడం కూడా ఒకరకంగా దీనికి హెల్ప్‌ అయ్యింది.

తమన్నా

ఎప్పటికప్పుడూ ట్రెండింగ్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకునే తమన్నా ఈ ఏడాది కూడా టాప్‌ 10లో చోటు దక్కించుకుంది. రెగ్యులర్‌గా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నాలుగో స్థానంలో నిలిచింది.

నయనతార

గూగుల్‌లో అత్యధికంగా వెతికిన హీరోయిన్ల జాబితాలో నయనతార ఐదో స్థానంలో నిలిచింది. కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌తో పెండ్లి, సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడం వంటి విషయాల కారణంగా నెటిజన్లు నయన్‌ గురించి ఎక్కువగా వెతికారు.

చేతిలో సినిమాలు ఏవీ లేకపోయినా అనుష్క శెట్టి మాత్రం తన క్రేజ్‌ను కోల్పోలేదు. అందుకే ఈ ఏడాది కూడా టాప్‌ 10లో చోటు దక్కించుకుంది. గూగుల్‌ సెర్చ్‌ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. పూజాహెగ్డే ఏడో స్థానం దక్కించుకుంది. ఇక ఎనిమిదో స్థానాన్ని కీర్తి సురేశ్‌ చేజిక్కించుకుంది. లవ్‌ స్టోరి, విరాటపర్వం వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించిన సాయిపల్లవి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక ఆశ్చర్యకరంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన క్రేజ్‌ను పోగొట్టుకుంది. ఈ ఏడాది టాప్‌ 10లో చివరి స్థానంతో సరిపెట్టుకుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Shriya saran | ప్రెగ్నెన్సీ విషయం అందుకే దాచాల్సి వచ్చింది.. అసలు విషయం చెప్పిన శ్రియ

Manchu Lakshmi | సరిదిద్దుకోలేని తప్పులు చేశా.. మంచు లక్ష్మీ భావోద్వేగం

kannada actress Abhinaya | సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. వరకట్న వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు

Pavala Shyamala | నాకు జరిగిన అవమానం తెలిస్తే చిరంజీవి సహించరు.. ఎమోషన్‌ అయిన పావలా శ్యామల

Anupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News