Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsIndia Vs Bangladesh | బంగ్లాదేశ్‌ను కుప్పకూల్చిన భారత బౌలర్లు.. 150 పరుగులకే తొలిఇన్నింగ్స్‌లో ఆలౌట్

India Vs Bangladesh | బంగ్లాదేశ్‌ను కుప్పకూల్చిన భారత బౌలర్లు.. 150 పరుగులకే తొలిఇన్నింగ్స్‌లో ఆలౌట్

India Vs Bangladesh | బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ( Bangladesh 1st Innings ) 150 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 254 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారత బౌలర్ కుల్‌దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో బంగ్లా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 40 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు.

బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ రహీమ్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జకీర్ 20, లిటన్ దాస్ 24 పరుగులు చేశారు. కాగా బంగ్లాను ఫాలో ఆన్ ఆడించకుండా బ్యాటింగ్ చేయడానికే కెప్టెన్ కేఎల్ రాహుల్ మొగ్గుచూపాడు.

అంతకుముందు ఓవర్‌నైట్ 133/8 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లా ఆదిలోనే ఎబాడట్ వికెట్ కోల్పోయింది. మెహిదీ హసన్‌ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్ 150 పరుగుల వద్ద ముగిసింది.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్

బంగ్లాను ఫాలో ఆడించకుండా బ్యాటింగ్ దిగాలని భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ నిర్ణయించడంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మూడో రోజు లంచ్ సమయానికి భారత్ 36 పరగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ 20 పరుగులతో శుభ్‌మన్ గిల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారీ స్కోరు చేసి బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించే ఆలోచనలో భారత్ ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Arjun Tendulkar | తండ్రికి తగ్గ తనయుడు.. రంజీ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టిన అర్జున్‌ టెండూల్కర్‌

Lionel Messi Retirement | ఇదే నా చివరి ప్రపంచ కప్‌.. అర్జెంటీనా స్టార్‌ మెస్సీ సంచలన ప్రకటన

Top 10 south Indian actress | ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికింది ఈ హీరోయిన్‌ గురించే..

How to wash silk sarees | పట్టుబట్టలపై మరకలు పడ్డాయా? ఈ చిట్కాలతో సులువుగా పోగొట్టుకోండి

Padmasana | పద్మాసనం ఎలా వేయాలి? ఈ యోగాసనం వేస్తే కలిగే ప్రయోజనాలేంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News