Thursday, June 13, 2024
- Advertisment -
HomeEntertainmentShriya saran | ప్రెగ్నెన్సీ విషయం అందుకే దాచాల్సి వచ్చింది.. అసలు విషయం చెప్పిన శ్రియ

Shriya saran | ప్రెగ్నెన్సీ విషయం అందుకే దాచాల్సి వచ్చింది.. అసలు విషయం చెప్పిన శ్రియ

Shriya saran | మిలీనియం మొదట్లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రియా శరణ్‌.. ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. రెండు దశాబ్దాలైన వన్నె తగ్గని అందంతో ఇప్పటికీ కుర్ర కారును మత్తె్క్కిస్తుంది. పెళ్లి తర్వాత కూడా బిజీ యాక్ట్రెస్‌గా కొనసాగుతోంది. ఒకవైపు కెరీర్‌ను.. మరోవైపు పర్సనల్‌ లైఫ్‌ను పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్‌ చేసుకుంటుంది. 2018లో ఆండ్రీ కొచ్చివ్‌ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకున్న శ్రియ.. కరోనా టైమ్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రెగ్నెంట్‌ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే దాకా కూడా ఈ విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచింది. అప్పుడు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఇప్పుడు శ్రియ తాజాగా వివరించింది.

శ్రియ శరణ్‌ బాలీవుడ్‌లో నటించిన తాజా చిత్రం దృశ్యం 2 విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న శ్రియ.. తన ప్రెగ్నెన్సీని ఎందుకు సీక్రెట్‌గా ఉంచాల్సి వచ్చిందో రివీల్‌ చేసింది. తన కూతురు రాధ కడుపులో ఉన్న అందమైన క్షణాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆస్వాదించాలని అనుకున్నట్టు శ్రియ తెలిపింది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎవరైనా లావు అవుతారు. కానీ హీరోయిన్స్‌ విషయంలో దీన్ని సింపుల్‌ విషయంగా జనాలు చూడలేరని తెలిపింది. ఆ సమయంలో తాను లావు అవుతుండటంతో ఆ క్షణాలను షేర్‌ చేసుకోవడానికి ఇష్టపడలేదని తెలిపింది.. అభిమానులు, మీడియాకు తెలిస్తే తన బాడీ షేప్‌పై ట్రోల్‌ చేస్తారని, తన బిడ్డపైనే ఫోకస్‌ చేస్తారని భయపడ్డానని పేర్కొంది.

అందుకే ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఒత్తిడికి గురికావాలని అనుకోలేదని.. అమ్మతనాన్ని ఆనందంగా ఆస్వాదించాలని అనుకున్నానని తెలిపింది. అందుకే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచిపెట్టానని పేర్కొంది.

అంతేకాదు ‘ ప్రెగ్నెంట్‌ అని తెలిసిన తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది. కానీ అప్పటికే చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. దాంతో గర్భం దాల్చిన విషయం ఎవరికీ చెప్పలేదు. ఆ విషయాన్ని దాచి సినిమాల్లో నటించా. నెలలు పెరుగుతున్నా కొద్దీ సినిమాలకు దూరంగా ఉండిపోయానని’ శ్రియ చెప్పుకొచ్చింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Manchu Lakshmi | సరిదిద్దుకోలేని తప్పులు చేశా.. మంచు లక్ష్మీ భావోద్వేగం

kannada actress Abhinaya | సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. వరకట్న వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు

Pavala Shyamala | నాకు జరిగిన అవమానం తెలిస్తే చిరంజీవి సహించరు.. ఎమోషన్‌ అయిన పావలా శ్యామల

Anupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

Parineeti Chopra | ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌.. సౌత్‌ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం బతిమిలాడుతున్న బాలీవుడ్‌ బ్యూటీ

Sushant singh rajput | సుశాంత్‌ మరణించిన ఫ్లాట్‌ అంటేనే భయపడిపోతున్నారట.. అందుకే రెండున్నరేళ్లయినా ఖాళీగానే ఉంది

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Beauty tips for lips | చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

Health Tips | నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. కారణాలు ఇవే కావచ్చు! ఒకసారి చెక్ చేసుకోండి..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News