Friday, April 19, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowHow to wash silk sarees | పట్టుబట్టలపై మరకలు పడ్డాయా? ఈ చిట్కాలతో సులువుగా...

How to wash silk sarees | పట్టుబట్టలపై మరకలు పడ్డాయా? ఈ చిట్కాలతో సులువుగా పోగొట్టుకోండి

How to wash silk sarees | పెళ్లిళ్లు అయినా.. శుభకార్యాలు అయినా.. పూజలు అయినా.. వ్రతాలు అయినా పట్టు వస్త్రాలు ధరించాల్సిందే. హిందూ సంప్రదాయంలో పట్టు వస్త్రాలకు అంత ప్రాముఖ్యత ఇస్తారు. ఇక ఆడవాళ్లకు పట్టు చీరల మీద ఎంత ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పట్టు బట్టలు వేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది.. కానీ వాటి మీద ఏమైనా మరకలు పడ్డప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. మొండి మరకలు పోవాలని గట్టిగా ఉతికితే బట్టలు పాడవుతాయి. సున్నితంగా పిండితే మరకలు పోవు. దీంతో ఎంత కొత్తవైనా తొందరగానే మూలకు పడేయాల్సి వస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? పట్టు బట్టలపై పడిన మరకలు పోవాలంటే ఏం చేయాలి? వీటికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఫాలో అయితే సులువుగా మరకలు పోగొట్టవచ్చు.

➢ పట్టు బట్టల మీద పడిన కాఫీ లేదా టీ మరకలు పోవాలంటే కార్బన్‌ టెట్రాక్లోరైడ్‌ పోయాలి. పెరుగు, వెన్న మరకలు పోవాలన్నా కూడా కార్బన్‌ టెట్రాక్లోరైడ్‌ పోయాలి. ఆ తర్వాత ఉతికితే మరకలు పోతాయి. అలా పోకపోతే వేడి నీటిలో కొద్దిగా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి ఆ నీటితో ఉతకాలి. పట్టుబట్టల మీద చాక్లెట్‌ మరకలను పోగొట్టేందుకు వేడి నీటితో ఉతికి జాడించాలి.

➢ పట్టుబట్టల మీద ఇంక్‌ లేదా లిప్‌స్టిక్‌ మరకలు పడితే ఆ భాగంలో పేపర్‌ ఉంచి దాని వెనుక నుంచి డ్రైక్లీనింగ్‌ ద్రావణం లేదా ఆల్కహాల్‌ పోయాలి. ఆ తర్వాత దాన్ని రుద్దాలి. మరకపోయే వరకు నీటిలో ఉంచకూడదు. నెయిల్‌ పాలిష్‌ మరకలు అయిన చోట అసిటోన్‌లో ముంచి క్లీన్‌ చేయాలి.

➢ పట్టు వస్త్రాలపై బురద మరకలు పడినప్పుడు అది ఎండిపోయే వరకు ఆగాలి. ఆ తర్వాత కార్బన్‌ టెట్రాక్లోరైడ్‌తో తుడవాలి. ఆ తర్వాత ఉతికితే మరకలు పోతాయి. షూ పాలిష్‌ మరకలు పోవాలంటే కొద్దిగా లిక్విడ్‌ డిటర్జెంట్‌ వేసి రుద్దాలి. అనంతరం ఆల్కహాల్‌ పూయాలి.

ఇలా చేస్తే ఎక్కువ రోజులు కొత్తగా ఉంటాయి

పట్టుబట్టలు ఎక్కువ రోజులు కొత్తగా కనబడాలంటే.. చెక్కతో చేసిన పెట్టెలో నేరుగా తాకకుండా ఒక సంచిలో ఉంచి పెట్టాలి. ప్లాస్టిక్‌ సంచుల్లో భద్రపరచడం ద్వారా ఎక్కువ రోజులు ఉంటాయి.. కాటన్‌, పేపర్‌ సంచుల్లో ఉంచి కూడా దాచిపెట్టవచ్చు. గాలి, వెలుతురు లేని తగలనివ్వకూడదు. అలా అని ఎక్కువ రోజులు అలాగే ఉంచడం కూడా మంచిది కాదు. దీని వల్ల ముడతలు ఉన్న చోట చినిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు బయటకు తీసి గాలి తగలనివ్వాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vasthu Tips | ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News