Tuesday, June 18, 2024
- Advertisment -
HomeEntertainmentPawan Kalyan | పవన్ కళ్యాణ్ గారూ.. చెప్పినంత ఈజీ కాదు సర్ డేట్స్ ఇవ్వడం..!

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గారూ.. చెప్పినంత ఈజీ కాదు సర్ డేట్స్ ఇవ్వడం..!

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు..? ఈ ప్రశ్నకు సమాధానం పవన్ కూడా సరిగ్గా చెప్పలేడు. ఎందుకంటే ఆయనకు కూడా తెలియదు ఎప్పుడు ఏ సినిమాకు కమిట్ అవుతున్నాడో..? ప్రస్తుతం పవన్ ఉన్న పరిస్థితుల్లో ఆయనకు కేవలం డబ్బులు మాత్రమే కావాలి. అందుకే 30 రోజుల డేట్స్ ఇచ్చి కూడా 50 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు.

ఇచ్చేవాడు ఉన్నపుడు తీసుకునేవాడికి ఏంటి నొప్పి అన్నట్లు మారిపోయింది ఇప్పుడు పవన్ నిర్మాతల పరిస్థితి. ఆయన డేట్స్ బంగారం అయిపోయాయి.. ఎంతలా అంటే సుజీత్ సినిమాకు కేవలం 32 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చి అక్షరాలా 60 కోట్లతో పాటు బిజినెస్‌లోనూ వాటా తీసుకుంటున్నాడు పవర్ స్టార్. మరోవైపు హరీష్ శంకర్ సినిమాకు కూడా అంతా కొడితే ఇచ్చింది 35 రోజులు మాత్రమే. మరోవైపు ఈ గ్యాప్‌లోనే వినోదీయ సితం రీమేక్ కమిటయ్యాడు పవన్.

సైలెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసారు దర్శక నిర్మాతలు. దీనికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నాడు. స్నేహితుడి కోసం తనను తాను ఓ మెట్టు దిగడానికి రెడీ అయిపోయాడు మాటల మాంత్రికుడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఫిబ్రవరి మూడో వారంలోనే మొదలు కానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి 21 నుంచి సముద్రఖని దర్శకత్వంలో వినోదీయ సితం రీమేక్ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది.

అయితే అన్నీబాగానే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు సగం పూర్తైన హరిహర వీరమల్లు సినిమానే ఇంకా పూర్తి చేయలేదు పవన్.. అంతలోనే సుజీత్, హరీష్ శంకర్, సముద్ర ఖని సినిమాలను కూడా ఒకేసారి మొదలు పెడుతున్నాడు. మరి కమిటై.. డబ్బులు తీసుకున్నంత ఈజీగా వీటికి డేట్స్ కూడా అడ్జస్ట్ చేస్తాడా..? చేయగలడా..? చేసేంత ప్లానింగ్ పవన్ దగ్గర ఉందా అనేది అనుమానమే. ఎందుకంటే మరో ఏడాదిలో ఎన్నికల నగారా మోగబోతుంది.

అంటే కనీసం 8 నెలల ముందు నుంచే ప్రచారంలో ఉండాలి. ఇప్పటికే పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనే విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు పవన్. ఇలాంటి సమయంలో వరసగా సినిమాలు చేస్తూ.. ఇక్కడే ఉండిపోతే ప్రతిపక్షాలు కచ్చితంగా ఈయన్ని మరింత టార్గెట్ చేసే చాన్స్ లేకపోలేదు. అందుకే ఎన్నికల్లోపు ఎన్ని సినిమాలు వీలైతే అన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు పవన్. ప్లాన్ అయితే బాగానే ఉంది.. కానీ పేపర్ ప్లానింగ్ వరకు ఉండకుండా బయట కూడా అప్లై చేస్తే బాగుంటుందనేది అభిమానుల ఆశ.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ramcharan | ఆ కొరియోగ్రఫర్‌తో కలిసి మెగా ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్..

Nayanthara | నా భర్తనే అవమానిస్తారా? ఆ హీరోతో జన్మలో నటించను.. మంగమ్మ శపథం పట్టిన నయనతార?

Actress Hema | కొత్త బిజినెస్‌ పెట్టా.. అందుకే సినిమాలు మానేశా.. అసలు విషయం చెప్పిన హేమ

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News