Home Entertainment Oscars2023 | ఆస్కార్ తుదిపోరులో నిలిచిన ఆర్ఆర్ఆర్.. 1957 నుంచి ఇప్పటివరకు అకాడమీ అవార్డులకు ఎన్ని...

Oscars2023 | ఆస్కార్ తుదిపోరులో నిలిచిన ఆర్ఆర్ఆర్.. 1957 నుంచి ఇప్పటివరకు అకాడమీ అవార్డులకు ఎన్ని సినిమాలు నామినేట్ అయ్యాయంటే..

Oscars2023 | రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుని.. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. 95వ ఆస్కార్ అకాడమీ అవార్డులకు సంబంధించిన తుది నామినేషన్లలో చోటు దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌కు గానూ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు సంపాదించుకుంది. ఇక ఆస్కార్ అందుకోవడం ఒక్కడే మిగిలిపోయింది.

ఆస్కార్ అంటే భారతీయ సినిమాలకు అందని ద్రాక్షగానే ఉన్న టైమ్‌‌లో కష్టపడితే కానిది ఏమున్నదని నిరూపించాడు రాజమౌళి. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది కాబట్టి అకాడమీ అవార్డు అందుకోవడం ఇక నామమాత్రమేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఏదైనా భారతీయ సినిమా ఆస్కార్ నామినేషన్స్ ఫైనల్ వరకు వెళ్లాయా? లేదా? అని వెతుకుతున్నారు. అయితే 1957 నుంచి ఇప్పటివరకు మొత్తం 54 చిత్రాలు భారత్ నుంచి ఆస్కార్ షార్ట్‌లిస్టుకు ఎంపికయ్యాయి. వాటిలో తెలుగు చిత్రం కూడా ఉంది. అదే కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్, రాధిక ప్రధాన పాత్రలో వచ్చిన స్వాతిముత్యం. కానీ ఫైనల్ నామినేషన్స్‌లో మాత్రం ఎంపిక కాలేకపోయింది. మరి ఆర్ఆర్ఆర్ తరహాలో ఫైనల్ జాబితాలో నిలిచిన చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం..

మదర్ ఇండియా

దేశంలోని గ్రామాలు, రైతుల పరిస్థితులపై వచ్చిన చిత్రం మదర్ ఇండియా. నర్గీస్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి మెహబూబ్‌ ఖాన్ దర్శకత్వం వహించారు. 1957లో భారత్ నుంచి తొలిసారిగా ఈ చిత్రం ఆస్కార్ అకాడమీ అవార్డుల బరిలో నిలిచింది.

సలామ్ బాంబే

మదర్ ఇండియా సినిమా తర్వాత దాదాపు 30 ఏళ్లు ఒక్క సినిమా కూడా ఆస్కార్‌కు నామినేట్ కాలేదు. 1988లో మీరా నాయర్ దర్శకత్వంలో వచ్చిన సలామ్ బాంబే సినిమా అకాడమీ అవార్డుల బరిలో నిలిచింది. ముంబై వీధి బాలలపై తీసిన ఈ సినిమా ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ వరకూ వెళ్లింది.

లగాన్

భారత్ నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన మూడో చిత్రంగా లగాన్ నిలిచింది. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కీలక పాత్రలో ఆశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. క్రికెట్ నేపథ్యంలో 2001లో వచ్చిన ఈ సినిమాకు ఇండియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో బెస్ట్ ఫారెన్ ఫిలిం కేటగిరీలో భారత్ తరఫున అకాడమీ అవార్డ్స్ నామినేషన్స్‌కు పంపించారు. కానీ ఆస్కార్ మాత్రం అందుకోలేకపోయింది.

RRR

లగాన్ తర్వాత దాదాపు 22 సంవత్సరాల వరకు ఒక్క సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలవలేకోయాయి. ప్రతి ఏడాది ఏదో ఓ చిత్రాన్ని భారత్ తరఫున నామినేట్ చేసినప్పటికీ షార్ట్‌లిస్ట్ టైమ్‌లోనే పోటీ నుంచి తప్పుకున్నాయి. ఈసారి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారత్ నుంచి గుజరాతీ చిత్రం ఛెల్లో షోను నామినేషన్స్‌కు పంపించారు. ఈ సినిమా మొదట షార్ట్‌లిస్ట్ అయినప్పటికీ.. తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుల ఫైనల్ నామినేషన్స్ లిస్టులో చోటు సంపాదించుకుంది. కీరవాణి మ్యూజిక్ ఇచ్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించాడు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ కంపోజ్ చేశాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Naatu Naatu Song in Oscar list | ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ పాట.. ఎన్టీఆర్‌కు మాత్రం నిరాశే

NTR vs ANR | టాలీవుడ్‌లో సరికొత్త రచ్చ.. ఎన్టీఆర్, ఏయన్నార్ ఫ్యామిలీ మధ్య ముదురుతున్న వివాదం

Kl Rahul – Athiya Shetty | ఓ ఇంటివాడైన కేఎల్‌ రాహుల్‌.. ప్రియురాలు అతియా శెట్టితో ఏడడుగులు

Karthika Deepam | సిగ్గుపడుతున్నా అంటే నాకు పెళ్లికళ వచ్చేసినట్టే.. ట్విస్ట్‌ ఇచ్చిన కార్తీక దీపం మోనిత

Keerthy Suresh | విడాకులకు సిద్ధమైన కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్.. కీర్తి సురేశ్‌తో ప్రేమే కారణమా?

Exit mobile version