Home Entertainment NTR vs ANR | టాలీవుడ్‌లో సరికొత్త రచ్చ.. ఎన్టీఆర్, ఏయన్నార్ ఫ్యామిలీ మధ్య ముదురుతున్న...

NTR vs ANR | టాలీవుడ్‌లో సరికొత్త రచ్చ.. ఎన్టీఆర్, ఏయన్నార్ ఫ్యామిలీ మధ్య ముదురుతున్న వివాదం

NTR vs ANR | టాలీవుడ్‌లో సరికొత్త రచ్చ మొదలైంది. వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అక్కినేని, తొక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలతో ఎన్టీఆర్, ఏయన్నార్ ఫ్యామిలీ మధ్య వివాదం మొదలైంది.

వీరసింహారెడ్డి సక్సెస్‌మీట్‌లో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ నోరు జారారు. వీరసింహుని విజయోత్సవం పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో మాట్లాడిన బాలయ్య.. సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నిషియన్లను అభినందించారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న జయరాం అనే ఆర్టిస్టు గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక ఈయన ఉన్నారంటే సెట్‌లో నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకుంటుండే వాళ్లం అని బాలయ్య అనేశారు. అయితే అక్కినేని.. తొక్కినేని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అక్కినేని ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. దీనిపై రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. బాలయ్య మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో అక్కినేని యువ నటులు నాగచైతన్య స్పందించాడు. ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు.

నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే అంటూ నాగచైతన్య పేర్కొన్నాడు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే నాగచైతన్య తొలిసారిగా ఇలా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. దీనికి మరి బాలకృష్ణ క్షమాపణ చెబుతాడా? లేదా ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kl Rahul – Athiya Shetty | ఓ ఇంటివాడైన కేఎల్‌ రాహుల్‌.. ప్రియురాలు అతియా శెట్టితో ఏడడుగులు

sudheer varma | టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్‌ వర్మ ఎలా చనిపోయాడు? అంత హడావుడిగా అంత్యక్రియలు ఎందుకు జరిపించారు?

Sunil | మళ్లీ బిజీ అయిపోతున్న సునీల్.. కోలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా లేదుగా..

Rasha Thadani | బాలీవుడ్‌లోకి మరో స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కేజీఎఫ్‌ నటి కూతురు

Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో

Exit mobile version