Thursday, September 21, 2023
- Advertisment -
HomeEntertainmentKajal Aggarwal | అమ్మో.. రీఎంట్రీలో కూడా కాజల్ అగర్వాల్ అంత డిమాండ్ చేస్తుందా?

Kajal Aggarwal | అమ్మో.. రీఎంట్రీలో కూడా కాజల్ అగర్వాల్ అంత డిమాండ్ చేస్తుందా?

Kajal Aggarwal | పెళ్లయి ఒక బాబు పుట్టినప్పటికీ తరగని అందంతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్.. టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ నటించింది. చిరంజీవి రీఎంట్రీ ఖైదీ నంబర్ 150 సినిమాతోనూ మెప్పించింది. 2020లో కెరీర్‌ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుని వెండితెరకు దూరమైంది. దాంపత్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ పండంటి బాబుకి జన్మనిచ్చింది. ప్రస్తుతం మాతృత్వ మధురిమలు ఎంజాయ్ చేస్తున్న కాజల్.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.

బాబు పుట్టిన తర్వాత కూడా తన అందం ఇసుమంతైనా తగ్గలేదని చెబుతూ వరుసగా తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కాజల్ ఎక్కువగా వెబ్ సిరీస్‌ల్లో నటించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రీఎంట్రీ సమయంలో కూడా కాజల్ తన రేంజ్ తగ్గలేదని చెబుతోంది. అందుకే రెమ్యునరేషన్‌ను అదే స్థాయిలో డిమాండ్ చేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఒక్కో సినిమాకు కాజల్ రూ.3 కోట్ల వరకు తీసుకునేది. ఇప్పుడు రీఎంట్రీలో కూడా అంతే డిమాండ్ చేస్తుందట. ఒక్కో సినిమాకు రూ.3కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని టాక్. సీనియర్ హీరోలకు ప్రస్తుతం కాజల్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. దీంతో కాజల్ అగర్వాల్‌కు ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తున్నాయని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉండననున్నట్టు తెలుస్తోంది.

పెళ్లి చేసుకోవడానికి ముందు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమా ఒప్పుకుంది. ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంది. కాజల్‌కు పెళ్లి కావడంతో ఇండియన్ 2 సినిమా నుంచి తప్పించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని కాజల్ చెబుతోంది. మరి రీఎంట్రీలో కూడా కాజల్ అగర్వాల్ అదే హవా కొనసాగిస్తుందో లేదో చూడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Jeremy Renner | బాంబ్ సైక్లోన్ ఎఫెక్ట్.. తీవ్రంగా గాయపడ్డ అవెంజర్స్ ఫేమ్ మార్వెల్ సూపర్ హీరో జెరెమీ రెన్నర్‌.. పరిస్థితి విషమం

Jabardast Comedian Kiraak RP | బంపర్ రెస్పాన్స్ ఉన్నా కిరాక్ ఆర్పీ చేపల పులుసు దుకాణం మూసేశాడు.. పగోడికి కూడా ఆ కష్టం రావద్దు

Kajal Aggarwal | అమ్మో.. రీఎంట్రీలో కూడా కాజల్ అగర్వాల్ అంత డిమాండ్ చేస్తుందా?

Aadi Saikumar | వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆదికి వరుస ఆఫర్లు ఎలా వస్తున్నాయి?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News