Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentJeremy Renner | బాంబ్ సైక్లోన్ ఎఫెక్ట్.. తీవ్రంగా గాయపడ్డ అవెంజర్స్ ఫేమ్ మార్వెల్ సూపర్...

Jeremy Renner | బాంబ్ సైక్లోన్ ఎఫెక్ట్.. తీవ్రంగా గాయపడ్డ అవెంజర్స్ ఫేమ్ మార్వెల్ సూపర్ హీరో జెరెమీ రెన్నర్‌.. పరిస్థితి విషమం

Jeremy Renner | అమెరికాలో కురుస్తున్న మంచు తుఫాను కారణంగా హాలీవుడ్ నటుడు, మార్వెల్ సూపర్ హీరో ( Marvel Super Hero ) జెరెమీ రెన్నర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటి బయట పేరుకుపోయిన మంచును తొలగిస్తుండగా జెరెమీ తీవ్రంగా గాయడపడ్డాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జెరెమీ రెన్నర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అయితే ప్రాణాపాయం ఏమీ లేదని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలియగానే ఆయన ఫ్యాన్స్.. తమ అభిమాన సూపర్ హీరో క్షేమంగా బయట పడాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

అగ్రరాజ్యం అమెరికాను బాంబ్ సైక్లోన్ ( Bomb cyclone ) వణికిస్తోంది. భారీ హిమపాతం కారణంగా దాదాపు 60 శాతానికి పైగా జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జెరెమీ రెన్నర్ నివాసం ఉంటున్న ఉత్తర నెవెడాలోని రెనో ప్రాంతంలో కూడా భారీ హిమపాతం కురుస్తుంది. దీనివల్ల అక్కడ విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. దాదాపు 35 వేల ఇళ్లు అంధకారంలో ఉన్నాయి. ఈ క్రమంలో తన ఇంటి బయట గడ్డకట్టి ఉన్న మంచును తొలగించేందుకు బయటకు వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం గురించి తెలియగానే అతన్ని హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.

జెరెమీ రెన్నర్ 1995లో హాలీవుడ్ సినిమాలకు ఎంట్రీ ఇచ్చాడు. రెండు సార్లు ఆస్కార్ ( Oscar ) అవార్డుకు నామినేట్ అయ్యాడు. ది హార్ట్ లాకర్ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా, ది టౌన్ సినిమాకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా నామినేట్ అయ్యాడు. వీటి తర్వాత మార్వెల్ ప్రపంచంలోకి సూపర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. 2011లో వచ్చిన థార్ ( Thor ) సినిమాలో తొలిసారిగా హాక్ ఐ అనే సూపర్ హీరోగా కనిపించాడు. ఆ తదుపరి ఏడాదే అవెంజర్స్ ( Avengers ) సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈయనకు ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అవెంజర్స్ ఎండ్ గేమ్ అయిపోయిన తర్వాత హాక్ ఐ ప్రధాన పాత్రలో ఒక వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషల్లో ఇది స్ట్రీమింగ్ అవుతున్నది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Telangana Assembly Elections | తెలంగాణలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? మార్చిలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా ?

BRS Andhra Pradesh president | బీఆర్‌ఎస్‌ వైపు ఏపీ నాయకుల చూపులు.. ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అయనేనా?

Delhi Accident | గంటన్నరపాటు కారు చక్రాల కిందనే యువతి మృతదేహం.. ఢిల్లీ యాక్సిడెంట్‌లో షాకింగ్ విషయాలు

Group 2 syllabus | నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 2 సిలబస్‌లో మార్పులు చేసిన టీఎస్‌పీఎస్సీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News