Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentKodali Nani | తారకరత్న రాజకీయ ఎంట్రీపై కొడాలి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kodali Nani | తారకరత్న రాజకీయ ఎంట్రీపై కొడాలి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kodali Nani | రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న టైమ్‌లోనే తారకరత్న కన్నుమూశారు. క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తన చివరి రోజుల్లో తారకరత్న ఆశపడ్డట్టు ఇప్పుడు ఒక వార్త వైరల్‌గా మారింది. గుడివాడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడాలి నానిపై పోటీ చేద్దామని తారకరత్న భావించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రంగారెడ్డి జిల్లా మోకిలలో తారకరత్న పార్థివ దేహానికి నివాళులర్పించిన తర్వాత కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తారకరత్నతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తారకరత్న మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఈ సందర్భంగా కొడాలి నాని అన్నారు. తారకరత్న అందరితో కలిసిమెలిసి ఉండేవాడని.. తనను అన్న అని పిలిచేవాడని గుర్తుచేసుకున్నారు. అలాగే తారకరత్న రాజకీయ ఎంట్రీపై కూడా స్పందించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని తారకరత్న ఆశపడ్డట్టు తెలిపారు. తాత పెట్టిన పార్టీ నుంచే పోటీ చేస్తానని తనతో అన్నాడని చెప్పారు. ఎన్టీఆర్ మనవడు అయినపన్పటికీ కష్టాన్నే నమ్ముకున్న వ్యక్తి తారకరత్న అని తెలిపారు. సినిమాలు అయినా.. రాజకీయాలు అయినా తాత దారిలోనే నడవాలని భావించాడని.. ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానునభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

BRS MLA Sayanna | బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..

Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం

Viral News | గుజరాత్‌లో నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్‌.. రూ. 500 కాగితాలను ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

YS Sharmila | మహబూబాబాద్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. వైఎస్‌ షర్మిల అరెస్టు.. పాదయాత్రకు అనుమతి కూడా రద్దు

Nandamuri Tarakaratna | తారకరత్న కన్నుమూత.. 23 రోజులు ప్రాణాలతో పోరాడి ఓడిన నందమూరి వారసుడు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News