Tuesday, April 23, 2024
- Advertisment -
HomeEntertainmentTarakaratna | NTR పేరు వచ్చేలా పిల్లలకు నామకరణం చేసిన తారకరత్న.. తాత అంటే ఎంత...

Tarakaratna | NTR పేరు వచ్చేలా పిల్లలకు నామకరణం చేసిన తారకరత్న.. తాత అంటే ఎంత ప్రేమో కదా!

Tarakaratna | తారకరత్నకు తన తాత నందమూరి తారక రామారావు అంటే ఎంతో అభిమానం. అందుకే తన పిల్లలకు కూడా తాత పేరు కలిసేలా పేర్లు పెట్టారు. తన ముగ్గురు పిల్లలకు నిష్క, తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. వీళ్ల ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపితే NTR అని వస్తుంది. తాత మీద ఉన్న అభిమానంతోనే తారకరత్న తన పిల్లలకు ఇలా పేర్లు పెట్టారని అతని సన్నిహితులు చెప్పుకుంటూ బాధపడుతున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

అలేఖ్య రెడ్డిని నందమూరి తారకరత్న సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరూ కలుసుకున్నారు. నందీశ్వరుడు సినిమాకు అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో వారిద్దరికీ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో తారకరత్ననే అలేఖ్య రెడ్డికి ప్రపోజ్ చేశాడు. కానీ అప్పటికే అలేఖ్య రెడ్డికి మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కొడుకు సందీప్ రెడ్డితో వివాహం జరిగింది. అభిప్రాయ బేధాలతో విడాకులు కూడా తీసుకున్నారు. దీంతో అలేఖ్య రెడ్డిని కొడలిగా చేసుకునేందుకు నందమూరి ఫ్యామిలీ ఇష్టపడలేదు. దీంతో తారకరత్న పెద్దలను ఎదురించి 2012లో ఆగస్టు 2న హైదరాబాద్ శివారులోని సంఘీ టెంపుల్‌లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఆ టైమ్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వీళ్ల పెళ్లికి అండగా నిలబడ్డారు. అన్నట్టు విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతురే అలేఖ్య రెడ్డి. అంటే ఆమెకు విజయసాయిరెడ్డి పెద్దనాన్న వరుస అవుతారు. అలా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నేళ్లపాటు వీళ్లు ఇరు కుటుంబాలకు దూరంగా ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత నందమూరి ఫ్యామిలీతో కలిసిపోయారు. వీరికి మొదట ఓ పాప పుట్టగా.. తర్వాత ఇద్దరు కవలపిల్లలు జన్మించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

BRS MLA Sayanna | బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..

Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం

Viral News | గుజరాత్‌లో నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్‌.. రూ. 500 కాగితాలను ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

YS Sharmila | మహబూబాబాద్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. వైఎస్‌ షర్మిల అరెస్టు.. పాదయాత్రకు అనుమతి కూడా రద్దు

Nandamuri Tarakaratna | తారకరత్న కన్నుమూత.. 23 రోజులు ప్రాణాలతో పోరాడి ఓడిన నందమూరి వారసుడు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News