Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsViral News | గుజరాత్‌లో నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్‌.. రూ. 500 కాగితాలను...

Viral News | గుజరాత్‌లో నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్‌.. రూ. 500 కాగితాలను ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

Viral News | గుజరాత్‌లో కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. ఓ మాజీ సర్పంచ్‌ తన మేనల్లుడి వివాహ వేడుకలో ఆర్బాటాలకు పోయాడు. అతని పెళ్లి గురించి కొన్నేళ్ల పాటు గొప్పగా చెప్పుకోవాలని తాపత్రయంతో బిల్డింగ్‌పై నుంచి రూ.500 నోట్లను వెదజల్లాడు. ఆకస్మాత్తుగా నోట్ల వర్షం కురుస్తుండటంతో అక్కడ ఉన్నవారంతా వాటిని ఏరుకోవడానికి ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గుజరాత్‌లోని మెహ్‌సాణా జిల్లా కడీ తాలుకాలోని మాజీ సర్పంచ్‌ కరీంబాయి దాదూబాయి జాదవ్‌ మేనల్లుడి వివాహం ఇటీవలే కుదిరింది. వాళ్ల కుటుంబంలో అతను ఒక్కడే మగ సంతానం కావడంతో చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచారు. ఇప్పుడు అతని పెళ్లి కూడా చాలా గ్రాండ్‌గా చేయాలని ఫిక్సయ్యారు. ఈ క్రమంలోనే అంగరంగ వైభవంగా కల్యాణం జరిపించారు. అయినా వాళ్ల సంతోషం తీరలేదు. ఇంకా వినూత్నంగా ఏదైనా చేయాలని భావించారు. అనుకున్నదే తడవుగా నోట్ల కట్టలు పట్టుకుని బిల్డింగ్‌ ఎక్కేశారు. ఆ ఏరియాలో రూ.500 నోట్లతో కరెన్సీ వర్షం కురిపించారు. అలా కరెన్సీ నోట్లను వెదజల్లడం చూసిన స్థానికులు.. వాటిని అందుకునేందుకు ఎగబడ్డారు. దాదాపు రూ.50 లక్షల వరకు అలా వర్షంగా కురిపించినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న పలువురు దీన్ని రికార్డు చేయడంతో దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News